మా ఫీల్డింగ్‌ పొరబాట్ల వల్లే కోహ్లీ సెంచరీ చేశాడు

– ఇంగ్లడ్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌
బర్మింగ్‌హామ్‌, ఆగస్టు4(జ‌నం సాక్షి) : ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఒంటరిపోరాటంతో అద్భుత శతకం చేసిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీపై ప్రపంచమంతా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ ఆటగాళ్లు క్యాచ్‌లు జారవిడవడం వల్లే కోహ్లీ శతకం నమోదు చేయగలిగాడని అంటున్నాడు ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ అన్నారు. రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే స్లిప్‌లో వచ్చిన క్యాచ్‌ అందుకుని ఉంటే కోహ్లీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండేది కాదని చెప్పాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 21 పరుగుల వద్ద కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌ ఫీల్డర్‌ డేవిడ్‌ మలాన్‌ వదిలేసిన సంగతి తెలిసిందే. అలాగే 51 పరుగల వద్ద కూడా కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్‌ వదిలేశాడు. ఈ రెండూ ఆండర్సన్‌ బౌలింగ్‌లోనే కావడం విశేషం. ‘నా బౌలింగ్‌లో కోహ్లీ ఆడుతున్నప్పుడు.. పలుసార్లు బంతి ఎడ్జ్‌ తీసుకుని స్లిప్‌లోకి వెళ్లిన సంగతి చూశాం. ఆ క్యాచ్‌లను అందుకునే ఉంటే కోహ్లీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. కోహ్లీలాంటి అత్యుత్తమ ఆటగాడు ఆడుతున్నప్పుడు మైదానంలో జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు ఇవ్వకూడదు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీని త్వరగా అవుట్‌ చేసి మ్యాచ్‌ను మా చేతుల్లోకి తీసుకుంటాం. ప్రపంచంలో అనితరసాధ్యమైనదేదీ లేదు. కోహ్లీని అవుట్‌ చేయడం అసంభవమేవిూ కాద’ని ఆండర్సన్‌ చెప్పాడు.