మా శిక్షణ శిబిరంపై కూడా విమర్శలా?

3

– విపక్షాలు హుందాగా వ్యవహరించాలి: హరీశ్‌

నిజామాబాద్‌ /సంగారెడ్డి,మే5(జనంసాక్షి):  టీఆంఎస్‌ శిక్షణా తరగతులను ప్రతిపక్షాలు విమర్శించడం తగదని  నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నిజాంసాగం ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం    మంత్రి మాట్లడుతూ   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే శిక్షణా తరగతులను నిర్వహించుకున్నామని తెలిపారు. ఆస్కీ సంస్థకు డబ్బులు చెల్లించి శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఈ సంస్థకు డబ్బులు చెల్లించి ఎవరైనా శిక్షణ తీసుకోవచ్చు అని తెలిపారు. శిక్షణా తరగతుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం సరైంది కాదన్నారు. విమర్శించిన నేతలే గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. సంకుచిత మనస్తత్వం గల వారే శిక్షణా తరగతులను విమర్శిస్తున్నారని తెలిపారు. విమర్శించే వాళ్లు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదు.. తెలంగాణ అభివృద్ధిలో కూడా కలిసి రావడం లేదని పేర్కొన్నారు. విపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు మంచి జరుగుతుందని తెలిసినా కూడా రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సింగీతం జలాశయం పునరుద్ధరణకు రూ. 1.50 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. జుక్కల్‌ నియోజకవర్గంలో గోదాముల నిర్మాణాలకు రూ. 10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. మిషన్‌ కాకతీయలో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. అంతకుముందు మెదచీ జిల్లా కేంద్రం సంగారెడ్డి మండలం బాసుగడ్డ తండాలో నూతన పాలిటెక్నిచీ కళాశాల భవనానికి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. కళాశాల భవనాన్ని రూ. 5 కోట్లతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో టీఆంఎస్‌ ఎమ్మెల్యే చింతా ప్రభాకంతో పాటు పలువురు పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హరీష్‌రావు ప్రకటించారు. త్వరలోనే సంగారెడ్డిలో సీఎం కేసీఆం పర్యటిస్తారని తెలిపారు.