మా సమ్మె చట్టబద్ధం విధుల్లో చేరం

2

– ఆర్టీసి కార్మిక సంఘనేతలు

హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి):

సమ్మెపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు మాత్రమే జారీచేసిందని… ఆ ప్రతి కూడా తమకు ఇంకా అందలేదని ఆర్టీసీ కార్మిక సంఘం నేత పద్మాకర్‌ స్పష్టం చేశారు. తాము న్యాయబద్ధంగానే సమ్మె చేస్తున్నామని… కోర్టు ఆదేశాల ప్రతిని పరిశీలించాకే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 12న జరిగే తదుపరి విచారణలో కోర్టుకు తమ వాదనను వినిపిస్తామన్నారు.రేపు రెండు రాష్గాల్లోని బస్‌ డిపోల ఎదుట ధర్నా చేయనున్నట్లు ఈయూ నేత పద్మాకర్‌ తెలిపారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా డిపోలు, బస్టాండ్లలో స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తామని, సోమవారం కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. చర్చలకు వెళ్లేది లేదని తాము ఎప్పుడూ అనలేదని, ఎవరు పిలిచినా చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని పేర్కొన్నారు. సామరస్య వాతావరణంలో చర్చలు జరగాలన్నారు.