మిజోరం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు ఈనెల తొమ్మదితో నామినేషన్ల గడువు ముగియనుందని ఈసీ పేర్కొంది. ఇప్పటీకే కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎఫ్‌, బీజేపీ, ఎన్సీపీలు పార్టీ అభ్యర్థులను ప్రకంటించాయి. కాంగ్రెస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. నేటి నుంచి మిజోరంలో ఈసీ నామినేషన్లను స్వీకరిస్తుంది. మొత్తం నలభై స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇదిలావుంటే ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. ఢిల్లీ ఓటరు జాబితాలో తొలగించిన 10 లక్షల ఓటర్ల విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు.తొలగించిన ఓట్లు ఆమ్‌ ఆద్మీ,కాంగ్రెస్‌ పార్టీలవేనని తెలిపారు. తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాలని, ఓట్లను తొలగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ కోరారు