మిలాద్ ఉన్ నబి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొండా సురేఖ
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 09(జనం సాక్షి)
మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా మైనారిటీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేపడానికి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి కొండా సురేఖ గ వారితోపాటు నల్లగొండ రమేష్, మీసాల ప్రకాష్, మమ్మద్ వసీం, మీర్జా ఇనాయట్ ఆర్థర్,రేణిగుంట్ల శివ, , రాజేష్, బొట్ల ప్రసాద్, మోయిన్, యాకూబ్, వినోద్, సిద్ధం రాము తదితరులు పాల్గొన్నారు. ప్రథమంగా పోచం మైదాన్ సెంటర్ అనంతరం మండి బజార్ చార్బోలి ఖిలా వరంగల్, ఓర్సు దర్గా, కరీమాబాద్ ప్రాంతాలలో పర్యటించి ముస్లిం సోదరీమణులకు సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసినారు తెలియజేసే క్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున మేడం తో కలిసి సెల్ఫీలు దిగి హంగామా చేశారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారు.