మిషన్ భగీరథపై పలు రాష్టాల్ర ఆసక్తి
నేడు హైదరాబాద్ కు మధ్యప్రదేశ్ అధికారుల బృందం
హైదరాబాద్,ఆగస్టు28 : మిషన్ భగీరథ ప్రాజెక్టుపై దేశంలోని పలు రాష్టాల్రు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రకు చెందిన అధికారుల బృందాలు తెలంగాణలో పర్యటించాయి. తాజాగా మధ్యప్రదేశ్ తమ రాష్టాన్రికి చెందిన జల్ నిగమ్ మర్యాదిత్ శాఖ ఇంజనీర్ల బృందం మంగళవారం హైదరాబాద్ కు రానుంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించే ఆ బృందానికి ఎర్రమంజిల్ లోని ఆర్.డబ్ల్యు.ఎస్.ఎస్ కార్యాలయంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం,లక్ష్యాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. బుధవారం నుంచి మధ్యప్రదేశ్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. బుధవారం మెదక్-సింగూరు, గురువారం మహబూబ్ నగర్-ఎల్లూరులో సాగుతున్న భగీరథ పనుల పురోగతిని మధ్యప్రదేశ్ అధికారులు పరిశీలిస్తారు.