మిషన్ భగీరథ ప్రారంభానికి రండి
– హైకోర్టును విభజించండి
– ప్రధానిమోదీకి కేసీఆర్ విజ్ఞప్తి
– కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ఉమాభారతిలతో భేటి
న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో సోమవారం బిజీగా గడిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం దాదాపు అరగంటపాటు చర్చించారు. హైకోర్టు విభజన సహా అనేక సమస్యలపై చర్చించారు. త్వరగా తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే మోదీని కలిసి రాష్ట్రంలోని పలు సమస్యలపై వివరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గజ్వెల్‌లో మిషన్ భగీరథ ప్రారంబ కార్యక్రమానికి ప్రధాని మోడీని కెసిఆర్ ఆహ్వానించారు. కాగా, అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడే ఉండి మోదీని కలిశారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై వివరించారు. ఆయన జైట్లీని కలిసి రాష్ట్రంలోని సమస్యలను వివరించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరినట్టు సమాచారం. ఆర్థికంగా తెలంగాణను ఆదుకోవాలని,ఎఫ్‌బిఆర్‌బిఎం సడలింపుతో రుణలు తెచ్చుకునే అవకాశాలు ఇవ్వాలని జైట్లీని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. సాయంత్రం ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. ఇరిగేషన్ నిధులతోపాటు పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి,బూరనర్సయ్య గౌడ్, కవిత, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి నేతలను కలిసిన వారిలో ఉన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో తెలంగాణ ప్రాజెక్టుల విషయంపై చర్చించారు. కృష్ణా వాటర్ బోర్డు అంశంపై తెలంగాణ అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉమాభారతి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ మంచి కార్యక్రమమని ఆమె ప్రశంసించారు. మిషన్ కాకతీయ పనులను పరిశీలించేందుకు వస్తానని ఈ సందర్భంగా ఉమా భారతి చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను గురించి వివరించారు. వీటిని పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీటిపారుదల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు మిషన్ కాకతీయ పనులను చూసేందుకు త్వరలో తాను తెలంగాణకు రానున్నట్టు వెల్లడించారు. మిషన్ కాకతీయ ప్రయోగం దేశం మొత్తానికే ఆదర్శమని అన్నారు. తమ శాఖకు కూడా సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరానని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు మిగతా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కేంద్ర టాస్క్‌ఫోర్స్‌లో పెట్టామని తెలిపారు. నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రయత్నాలు బాగున్నాయని ఉమాభారతి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. మిషన్ కాకతీయ ప్రయోగం దేశం మొత్తానికి మంచి ఉదాహరణ అని అన్నారు. ఈ విషయంలో తమ శాఖకు కూడా సహకరించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.




