మిషన్ భగీరథ భేష్…
– దేశానికి మార్గ నిర్దేశం ఈ పథకం
– కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, రాంక్రిపాల్ యాదవ్
హైదరాబాద్, ఏప్రిల్ 19(జనంసాక్షి):పంచాయితీరాజ్, గ్రావిూణాభివృద్ధి, తాగునీటి సరాఫరా శాఖలపై కేంద్రమంత్రులు చౌదరీ బీరేంద్ర సింగ్, రామ్ క్రిపాల్ యాదవ్ మిషన్ భగీరథతో తెలంగాణ చరిత్ర సృష్టిస్తుందని కేంద్ర పంచాయితీరాజ్, గ్రావిూణాభివృద్ది శాఖ మంత్రి చౌదరీ బీరేంద్రసింగ్ చౌధరి అన్నారు. రాష్ట్రంలోని పంచాయితీరాజ్, గ్రావిూణాభివృద్ధి, తాగునీటి సరాఫరా శాఖ ల పనితీరుపై కేంద్రమంత్రులు చౌదరీ బీరేంద్ర సింగ్, రామ్ క్రిపాల్ యాదవ్ సవిూక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టుందుకు చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును మంత్రులు ప్రశంసించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి కష్టాలను సమూలంగా దూరం చేసే ఈ ప్రాజెక్టు దేశానికి మార్గదర్శనం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మణాలు, నిధుల సేకరణ ఎలా చేస్తున్నారో తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులపై అధికారులు చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆడియో వీడియో డాక్యుమెంటరీ ని కేంద్రమంత్రులు వీక్షించారు. త్వరలోనే రెండు రోజులు తెలంగాణలోనే ఉండి మిషన్ భగీరథ పనులను చూస్తానని కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. భారీ వ్యయం తో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సేకరణలో తన వంతు సహాయం చేస్తానని హామి ఇచ్చారు. జైకా, నాబార్డ్ వంటి సంస్థలతో స్వయంగా తాను మాట్లాడతానన్నారు. ఇంట్రా విలేజ్ పైప్ లైన్ల పనులను ఉపాధి హామి పథకం, గ్రామపంచాయితీ నిధులతో చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తెలంగాణలోని కరువు పరిస్థితులను మంత్రి కె.తారకరామారావు కేంద్రమంత్రులకు వివరించారు. మొత్తం 231 కరువు మండలాల కోసం సుమారు 3064 కోట్ల కేంద్ర సహాయం అడిగితే కేవలం 791 కోట్లు మాత్రమే మంజూరు చేశారని చెప్పారు. 555 కోట్ల తాగునీటి అవసరాల కోసం నిధులు అడిగితే కేవలం 72 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రెండు అంశాల్లో కేంద్రం మరితం సహాయం చేయాలని అడిగారు. అయితే ఆర్థిక సహాయం అంశంలో నీతి అయోగ్ మరిన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రులు చెప్పారు. పంచాయితీరాజ్ శాఖ మరియు ఉపాధి హామి పథకం పనుల గురించి మంత్రి కె.తారకరామారావు వివరించారు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉపాధి కల్పించామని తెలిపారు. ఉపాది హవిూ కింద శాశ్వత అస్తుల రూపకల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని, 1000 గ్రామ పంచాయితీ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక స్వచ్చ్ తెలంగాణ కింద గ్రామాల్లోనూ చెత్త సేకరణ చేస్తున్నామని, ఇందుకోసం ట్రై సైకిళ్లు( రిక్షాలు) కొన్నామన్నారు. ప్రతి గ్రామానికి ఓక డంపింగ్ యార్డ్ ఉండేలా ఇప్పటికే అధేశాలిచ్చామన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం 8వేలకోట్ల రూపాయలను విడుదల చేయనున్న నేపథ్యంలో నిధులకు కొరత లేదని కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. స్వఛ్చ భారత్ కింద టాయిలెట్ల నిర్మాణానికి పూర్తి సహకారం
అందిస్తామన్నారు. సవిూక్షా సమావేశం అనంతరం విూడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్ క్రిపాల్ యాదవ్….తాగునీటి సమస్య నివారణకు తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ గొప్ప ప్రయత్నమని దేశానికే మార్గదర్శనం చేసే ప్రాజెక్టు అన్నారు. ఇలాంటి ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా ఇతర రాష్ట్రాలకు తాము సూచిస్తున్నట్టు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందన్నారు. ఈ సవిూక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ తో పాటు శాఖాధిపతులు పాల్గొన్నారు




