మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా

తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్..

శుక్రవారం రోజున తుర్కపల్లి మండలంలో గల మిషన్ భగీరథ జి ఎల్ బి ఆర్ పంప్ హౌస్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి అక్కడే వంట- వార్పూ చేపట్టి అనంతరం తుర్కపల్లి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులు ప్రజలందరికి నీరు అందిస్తున్న వాళ్లు మాత్రం పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్న పది వేల లోపే వేతనం ఇస్తూ ఆర్ధిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 26000 ఇవ్వాలని లేని యెడల కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్మికుల విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదాలు జరిగి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి లేదని అర్ధాంతరంగా జీవితాలు ముగుస్తాయినీ ఈ పరిస్థితిని అధిగమించడం కోసం ఈఎస్ఐ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎమ్మార్వోలకి ,కలెక్టర్ గారికి మిషన్ భగీరథ ఎస్సీ గారికి దశలవారీగా ఆందోళన చేసి వినతి పత్రాలు ఇచ్చామని అయినా కనీస చలనం లేదని విమర్శించారు. పూర్తిస్థాయిలో నీళ్లు బంద్ చేస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని నీళ్ళు బందు చేసే కార్యక్రమం నిలిపి వేశామని వివిధ రూపాలలో నిరసనలు తెలియజేస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్, మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు )జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్, ఉపాధ్యక్షులు ఉగ్గి బాలరాజు,సంపత్, కుమారస్వామి , ప్రసాద్ జిల్లా నాయకులు సిద్దయ్య ,సత్యనారాయణ ,శ్రీకాంత్,అశోక్, శ్రీను, బాబు ,రాజు,సురేష్, చంద్రమౌళి ,మహేష్, ప్రవీణ్ ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.