మీడియా ముందుకు సానియా హత్యకేసు నిందితులు
హైదరాబాద్, జనంసాక్షి: సానియా హత్యకేసులో నిందితులను మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు హుమ్నాఖాన్ అని పోలీసులు తెలిపారు.తన ప్రేమకు అడ్డువస్తుందనే కారణంతో మరో ఇద్దరితో కలిసి సానియాను చంపివేసినట్టు తమ దర్యాప్తులో రుజువైందని వారు వెల్లడించారు. సానియాపై ఎలాంటి అత్యాచారం జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.