మీతో మేమున్నాం..
– వి.వి, కోదండ్, గద్దర్ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం
హైదరాబాద్,జనవరి21(జనంసాక్షి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సస్పెన్షన్‌కు గురయ్యాననే మనస్థాపంతో వేముల రోహిత్ అనే పీహెచ్‌డీ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనతో వర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తోన్నారు. విద్యార్థులకు పలు పార్టీల నేతలు మద్దతు పలుకుతున్నారు. ఈమేరకు ఇవాళ విద్యార్థుల దీక్షా స్థలిని గద్దర్, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రోహిత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులకు మద్దతు పలికారు.