మీ పాన్ కార్డ్ కు డైడ్ లైన్ ఉంది

పాన్ కార్డ్… పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) ను ఆధార్ తో అనుసంధానం చేయకపోతే జులై ఒకటి నుంచి చెల్లదని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ తో అనుసంధానం చేస్తే పాన్ కార్డ్ ను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండదంటోంది కేంద్రం. పాన్ కార్డ్ లో తప్పులున్నాయన్న దరఖాస్తుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయని అన్నారు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) ఉపాధ్యక్షులు రాధాకృష్ణన్.

అన్ని ప్రభుత్వ పథకాలకు, బ్యాంకులకు ఆధార్ కార్డ్ ను అనుసంధానం చేస్తోంది కేంద్రం. ఏప్రిల్ 30తో.. బ్యాంకులతో ఆధార్ కార్డ్ జతచేయకపోతే.. బ్యాంక్ అకౌంట్ లు పనిచేయవని చెప్పిన సంగతి తెలిసిందే.

దేశంలో 24.37 కోట్ల పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్స్ ఉంటే..113 కోట్లమందికి ఆధార్ కార్డ్ లను ఇష్యూ చేసింది UIDAI. 2012-13 ఏడాదిలో 2.87 కోట్ల మంది ఐటీలో ఫైల్ చేస్తే.. 1.62 కోట్ల మంది ఇన్ కంట్యాక్స్ ఎగవేతదారులు ఉన్నారని ప్రకటించింది. దీంతో పాన్ కార్డ్ లకు ఆధార్ నంబర్ ను లింక్ అప్ చేయాలని తలంచింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం జులై ఒకటి చివరి రోజుగా ప్రకటించింది. చేయకపోతే పాన్ కార్డ్ చెల్లదని తెలిపింది.