మీ భూములు కాపాడుతం
– భూ సేకరణ బిల్లును అడ్డుకుంటం
– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
జయపుర,జులై16(జనంసాక్షి):
పేద ప్రజల నుంచి భూ సేకరణ చట్టాల కింద అంగుళం భూమి కూడా తీసుకోనివ్వమని, రైతుల భూముల్ని కాపాడుతామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. కొత్తగా మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చే చట్టాన్ని అంగీకరించేది లేదన్నారు. ఇది రైతులను ముంచే చట్టమని అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ రాజస్థాన్‌లో పర్యటించారు. రాజస్థాన్‌లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ ద్వారా అంగుళం భూమి కూడా తీసుకోనివ్వకుండా కాంగ్రెస్ అడ్డుపడుతుందన్నారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ ప్రాంతంలో కొట్వాలి గ్రామంలో పాదయాత్ర చేస్తూ రాహుల్ రైతులతో మాట్లాడారు. రాజస్థాన్‌లో అవినీతి ముఖ్యమంత్రి స్థాయిలో ఉందని విమర్శించారు. ఐపీఎల్ మాజీ అధిపతి లలిత్ మోదీ వివాదంపైనా రాహుల్ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం పేదలు, రైతుల హక్కులను కాలరాస్తోందన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కూడా పాదయాత్రల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేపై రాహుల్ విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో మోడీ తాను లంచం తినను.. మరొకరిని తిననివ్వనని గొప్పలు చెప్పారు. వసుంధర రాజే వ్యవహారంపై మోడీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వసుంధర, సుష్మాస్వరాజ్ లలిత్‌గేట్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే.