ముందస్తు ఆలోచనలేదు

` పార్లమెంటులో  మా ఎజెండా ప్రకటిస్తాం
` జమిలి ఎన్నికలపై అనురాగ్‌ ఠాకూర్‌
న్యూఢల్లీి (జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికలకు వెళ్ల ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలపై పలు ఊహాగానాలు సాగుతున్న నేపధ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పదవీకాలం ముగిసే చివరి రోజు వరకూ తన సేవలను కొనసాగిస్తారని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిపించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడిరచారు.ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తారని లేదా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేస్తారని ప్రచారం చేస్తున్నారని, ఇదంతా విూడియా ఊహాగానాలేనని మంత్రి పేర్కొన్నారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌పై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ విస్తృత సంప్రదింపుల అనంతరం తమ నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.సెప్టెంబర్‌ 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్న మంత్రి ఈ సమావేశాల అజెండాను మాత్రం వెల్లడిరచలేదు. ఈ సమావేశాల అజెండాను సరైన సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటిస్తారని చెప్పారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ విధానంపై చర్చ జరుగుతున్న క్రమంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహించడంపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ పేరుతో ప్రభుత్వం తన అధికారాన్ని పొడిగించుకోవాలని ప్రయత్నిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.