ముందస్తు తనిఖీల్లో బైకులు స్వాధీనం

మంచిర్యాల,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జిల్లాలోని మందమర్రిలోని ప్రాణహిత కాలనీలో ఏసీపీ బాలు జాదవ్‌ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 75 బైకులు, 5 కార్లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యాజమానులకు నోటీసులు అందిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తనిఖీలకు సహకరించాలని డీసీపీ కోరారు