ముంబయి పేలుళ్ల కేసు

jkaf7craఐదుగురు దోష్ళలకు మరణశిక్ష
ఏడుగురికి జీవితఖైదు
హైదరాబాద్‌: 2006లో ముంబయి సబర్బన్‌ రైళ్లలో జరిగిన పేలుళ్ల కేసులో ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం ఐదుగురు దోష్ళలకు మరణశిక్ష ఖరారుచేసింది. ఈ కేసులో మొత్తం 12మందిని దోష్ళలుగా నిర్ధారించగా.. వారిలో ఐదుగురికి ఈరోజు ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో ఏడుగురికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో గతంలోనే దోష్ళలను నిర్ధారించిన ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు దోష్ళలకు శిక్ష ఖరారు చేసింది.
2006 జులై 11వ తేదీ సాయంత్రం ముంబయిలోని సబర్బన్‌ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో రైళ్లలోని ఫస్ట్‌క్లాస్‌ కంపార్టుమెంట్లలో కేవలం పదకొండు నిమిషాల వ్యవధిలో ఏడు పేలుళ్లు సంభవించి మొత్తం 188మంది ప్రాణాలను హరించివేశాయి. 800 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ కేసులో మొత్తం 13మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ఇటీవల న్యాయస్థానం వీరిలో 12 మందిని దోష్ళలుగా నిర్ధారించి ఒకరిని నిర్దోషిగా విడుదల చేసింది. దోష్ళలు తీవ్రవాద కార్యకలాపాలకు, సామూహిక హత్యలకు పాల్పడ్డారని న్యాయస్థానం పేర్కొంది. దోష్ళలను ‘మరణ వ్యాపారులు’గా అభివర్ణించిన ప్రాసిక్యూషన్‌, ఎనిమిది మంది దోష్ళలకు మరణశిక్ష విధించమని న్యాయస్థానాన్ని కోరింది.శిక్ష పడిన దోష్ళలు వీరే: కమల్‌ అహ్మద్‌ అన్సారీ(37), తన్వీర్‌ అహ్మద్‌ అన్సారీ(37), మహ్మద్‌ ఫైసల్‌ షేక్‌(36), ుౖతేహమ్‌ సిద్ధిఖీ(30), మహ్మద్‌ మజీద్‌ షఫీ(32), షేక్‌ ఆలమ్‌ షేక్‌(41), మహ్మద్‌ సాజిద్‌ అన్సారీ( 34), ముజమ్మల్‌ షేక్‌(27), సోహిల్‌ మహ్మద్‌ షేక్‌(43), జమీర్‌ అహ్మద్‌ షేక్‌(36), నవీద్‌ హుసేన్‌ ఖాన్‌(30), ఆసిఫ్‌ ఖాన్‌(38)