ముంబైలో 21 శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన
సిఎం, డిప్యూటి సిఎంలను ఆహ్వానించిన ఛైర్మన్
ముంబై,అగస్టు6( జనం సాక్షి): ముంబైలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , ఈవో ఎ వి ధర్మారెడ్డి ఆహ్వానించారు . ఈ మేరకు శనివారం వీరు ముంబైలో సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆగస్టు 21న ముంబైలో ఆలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి 10 ఎకరాల భూమి అప్పగించింది. కాగా రేమండ్స్ కంపెనీ అధినేత గౌతం సింఘానియా ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.