ముంబై పేలుళ్ల కేసులో అబూసలేంకు జీవిత ఖైదు

మరో నలుగురికి కూడా శిక్షలు ఖరారు

తీర్పు వెలువరించిన టాడా ప్రత్యేక కోర్టు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):ఎట్టకేలకు ముంబై అల్లర్ల కేసులో దోషులకు టాడా ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అబూ సలేంకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. సలేంతోపాటు మరో నలుగురికి కూడా కోర్టు శిక్షలు ఖరారు చేసేసింది. 1993లో ముంబై పేలుళ్లు చోటుచేసుకున్న కేసులో సుదర్ఘంగా విచారణ సాగింది. గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేమ్‌కు ముంబై పేలుళ్ల కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. గుజరాత్‌లోని బారుచ్‌ నుంచి ముంబైకి అతను ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో టైగర్‌ మెమన్‌కు కూడా గతంలో టాడా కోర్టు జీవిత శిక్షను ఖరారు చేసింది. ముంబై పేలుళ్ల కేసులో మరో ఇద్దరు దోషులు తాహిర్‌ మర్చెంట్‌, ఫిరోజ్‌ఖాన్‌లకు మరణశిక్షను విధించించి టాడా కోర్టు. ఇదే కేసులో మరో దోషి రియాజ్‌ సిద్ధికీకి పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ముంబై పేలుళ్ల కేసులో తాహీర్‌ కీలక దోషి. ఆయుధ శిక్షణ కోసం అతను భారతీయ యువతను పాకిస్థాన్‌కు పంపించాడు. మరో దోషి ఫిరోజ్‌ఖాన్‌ ఆయుధాలు చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆయుధాల సరఫరా కోసం పోలీసులు, కస్టమ్స్‌ ఆఫీసర్లను ఒప్పించాడు ఫిరోజ్‌ఖాన్‌. పేలుళ్ల తర్వాత తాను తీసుకువచ్చిన ఆయుధాలను ధ్వంసం చేశాడు. రియాజ్‌ సిద్ధికీకి పదేళ్ల శిక్ష పడింది. అతనికి జీవిత ఖైదు వేయాలని ప్రాసిక్యూటర్‌ కోరారు. గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేమ్‌కు డబ్బు, కారు అందజేయడంలో రియాజ్‌ కీలక పాత్ర పోషించాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌, గ్యాంగ్‌ స్టర్‌ అయిన సలేంను పోర్చుగల్‌ నుంచి భారత్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి చట్టాల్లో మరణశిక్ష లేకపోవటంతో ఒప్పందం ప్రకారం ఇక్కడ కూడా సలేంకు అలాంటి శిక్ష విధించే అవకాశం లేకుండా పోయింది. మరో ఇద్దరు దోషులు తెహీర్‌ మర్చంట్‌, ఫెరోజ్‌ ఖాన్‌ లకు తీవ్ర ఆరోపణల దృష్ట్యా మరణ శిక్షలను ఖరారు చేసేసింది. కరీముల్లా ఖాన్‌ కు యావజ్జీవ శిక్ష, రియాజ్‌ సిద్ధిఖీకి 10 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కేసు ప్రధాన సూత్ర ధారి ముస్తఫా దోసాతోపాటు మరో ఆరుగురిని దోషిగా తేలుస్తూ కోర్టు ఈ యేడాది జూన్‌ 16న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై యుద్ధం, కుట్రపూరిత నేరం తదితర ఆరోపణలు వీరిపై రుజువయ్యాయి. కానీ, ముస్తఫా గుండెపోటుతో జైల్లోనే మృతి చెందాడు. నిందితులో చాలా మట్టుకు మరణ శిక్ష ఖాయమని కేసు వాదిస్తున్న న్యాయవాది దీపక్‌ సాల్వీ తీర్పు వెలువడటానికి ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ముస్తఫా భారత్‌కు ఆర్డీఎక్స్‌ను తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా కొందరు యువకులను పాకిస్తాన్‌కు పంపి ఆయుధాల వినియోగంలో శిక్షణనిప్పించాడు. అబూసలేం ఆయుధాలను గుజరాత్‌నుంచి ముంబైకి తరలించాడు. ఈ కేసులో దోషిగా శిక్ష పూర్తిచేసుకున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు కూడా 1993 జనవరి 16న సలేం ఏకే 56 ఆయుధాలతోపాటు 250 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని గ్రనేడ్లను అందించాడు. తిరిగి జనవరి 18న సంజయ్‌దత్‌ ఇంటికొచ్చి వీటిని అబూసలేం తీసుకెళ్లాడు.తాహిర్‌ మర్చంట్‌ పాకిస్తాన్‌కు ఉగ్ర శిక్షణకు వెళ్లాల్సిన యువకులను గుర్తించి వారిని రెచ్చగొట్టాడు. భారత్‌లో అక్రమంగా ఆయుధ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులను సేకరించాడు.పిరోజ్‌ అబ్దుల్‌ ఖాన్‌ ఆయుధాలను తీసుకోవటంలో కస్టమ్స్‌ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి.. వాటిని జాగ్రత్తగా అనుకున్న లక్ష్యాలకు చేర్చాడు. దీంతోపాటుగా వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నాడు. గతేడాది మే చివర్లో విచారణ సందర్భంగా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు.2 మార్చి, 1993: గంట వ్యవధిలో 13 చోట్ల బాంబులు పేలి 257 మంది మృతి చెందగా 713 మందికి గాయాలు అయ్యాయి.