ముంబై రైళ్ల బాంబు పేలుళ్లలో 12 మంది దోషులుగా నిర్ధారణ

ywypy5d6మహారాష్ట్ర, సెప్టెంబర్ 11 : ముంబై రైళ్లలో బాంబు పేలుళ్ల కేసులో 12 మంది దోషులుగా నిర్ధారిస్తూ మకోకా కోర్టు శుక్రవారం తీర్పును వెలవడించింది. అలాగే ఈ కేసులో ఒక నిందితుడికి విముక్తి కల్పించింది. 2006 జూలై 11న ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాదులు ఆర్డీఎ ఉపయోగించి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. మొత్తం ఏడు పేలుళ్లు సంభవించగా…అన్నీ ఫస్ట్ క్లాస్ బోగీల్లోనే జరిగాయి.
ఈ బాంబు పేలుళ్లలో 188 మంది మృతి చెందగా 829 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు సాగిన విచారణలో 192 మంది సాక్షులను కోర్టు ప్రశ్నించింది. చివరగా ఈరోజు ఈ పేలుళ్లలో 12 మందిని దోషులుగా తేల్చుతూ మకోకా కోర్టు తీర్పు చెప్పింది.