ముఖ్యమంత్రి పర్యటన కోసం హార్ట్ ఎటాక్ అంటున్నా ఆపేశారు…

కోల్కతా: ముఖ్యమంత్రి పర్యటన కోసం పోలీసులు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటారనే సంగతి మరో సారి వెలుగు చూసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్ వెళుతుందంటూ ఓ ట్రాఫిక్ సిగ్నల్లో అంబులెన్స్ను నిలిపివేసిన ఘటన కోల్కతాలో బుధవారం చోటుచేసుకుంది. రోగి పరిస్థితి సీరియస్గా ఉందని, అత్యవసరంగా చికిత్స అందించాలని పోలీసులను రోగి కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా కనికరించలేదు.

వివరాల్లోకి వెళితే… కోల్కతాకు చెందిన మెహర్జాన్ బేగం (50) అనే మహిళకు గుండెపోటు రావటంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే  ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసరికి వారి వాహనం ట్రాఫిక్లో నిలిచిపోయింది.  సీఎం కాన్వాయ్ వస్తుందంటూ ట్రాఫిక్ను  పోలీసులు ఆపివేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగి ఉన్నారని సైరన్ వేస్తున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం పట్టించుకోలేదు.

పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా పోలీసులను.. రోగి బంధువులు … ఎంతగా ప్రాథేయపడి అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా ఓ పోలీస్ …రోగి పల్స్ చూసి మరీ … సీఎం వెళ్లివరకూ… షేషెంట్ పరిస్థితి బాగానే ఉంటుందంటూ ఉచిత సలహా ఇచ్చేశాడు. చివరకు ఓ సీనియర్ పోలీస్ అధికారి జోక్యంతో అంబులెన్స్కు అనుమతి ఇచ్చారు.  ఈ సందర్భంగా రోగి బంధువులు మాట్లాడుతూ… మేం రోగితో అంబులెన్స్లో ఉన్నాం. పోలీసులకు మా పరిస్థితిని వివరించినా… తామేమీ చేయలేమని సీఎం బయల్దేరినట్లు పైలట్  బయల్దేరినట్లు ఆదేశాలు అందాయన్నారు. అందుకే ట్రాఫిక్ను నిలిపివేసినట్లు’  పోలీసులు చెప్పారన్నారు.

మెహర్జాన్ బేగంకు బుధవారం ఉదయం గుండెనొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్…హార్ట్ ఎటాక్ అనే అనుమానం వ్యక్తం చేస్తూ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ సంఘటన ఎదురైంది. కాగా ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ని గుర్తించి ఇక‌నుండి తాను ప్ర‌యాణించే దారిగుండా త‌న‌కోసం ప్ర‌త్యేకంగా ట్రాఫిక్ నిలిపివేయాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ గతంలో పోలీసుల‌కు ఆజ్ఞాపించిన విషయం తెలిసిందే.