ముగిసిన సండ్ర కస్టడీ

1

హైదరాబాద్‌,జులై10(జనంసాక్షి):

ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. రెండురోజులపాటు ఆయనను ఓటుకు నోటుపై విచారించారు. పలు అంశాలను రాబట్టినట్లు సమాచారం. కస్టడీ ముగిసిన అనంతరం సండ్రను ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఉస్మానియాలో సండ్రకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సండ్రను కోర్టుకు తరలించారు. తరవాత కోర్టు ఆదేవాలతో  సండ్రను చర్లపల్లి జైలుకు తరలించారు.  ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన రెండో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ కేసులో ఈయన కీలక పాత్ర పోషించారని, ఈయనను విచారించడానికి ఐదు రోజుల కస్టడీ కావాలని ఎసిబి కోరగా, కోర్టు రెండు రోజుల విచారణకు అనుమతించింది. అది శుక్రవారం  సాయంత్రంతో ముగియగా ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా విచారణలో సండ్ర ఏ మేరకు సహకరించారన్నది ప్రశ్నార్ధకమే ,ఎక్కువ ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తు లేదని మాత్రమే సమాదానం ఇచ్చినట్లు చెబుతున్నారు.