ముగ్గురు పిల్లలతో సహ చెరువులో దూకిన తల్లీ
రంగారెడ్డి: మహేశ్వరం మండలంలోని కోళ్లపడకల్ గ్రామంలోని నీల(25), ఆమె పెద్ద కూతురు పల్లవి(5), రెండో కుమార్తె నవిత(3) ముగ్గురు కలిసి తుమ్మలగంట చెరువులో దూకగా నీల,పల్లవి ఇద్దరు మరణించారు. నీటిలో మునిగిపోతున్న నవవితను ఆ గ్రామానికి చెందిన రైతు ఎలుకంటి బాలరాజు రక్షించారు. భర్త,అత్త, మామల వేధింపులే కారణమని గ్రామస్తులంటున్నారు.