ముధోల్ లో రామరాజ్యం కావాలంటే కాషాయ జెండా ఎగరాల్సిందే..!రామన్న ను గెలిపించండి , జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్

భైంసా రూరల్ నవంబర్ 18 జనం సాక్షి

-గెలిచాక భైంసా నీ మహిష చేస్తా..!

-ముధోల్ తాలుకాని దత్తత తీసుకుంటా..!

-బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎం.పి బండి సంజయ్.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కెసిఆర్ మాజీ సీఎం అవ్వడం ఖాయమని, బి.ఆర్.ఎస్,కాంగ్రెస్ కి అధికారం కట్టబట్టినట్లయితే రాష్ట్రాన్ని మరో బైoసాల తయారు చేస్తారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. శనివారం బైంసా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు… మహిషా అంటేనే ఏదో కొత్త జోష్ వస్తుందని, ఇక్కడి బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ ఇప్పటికీ నవ యువకుడిలా పోరాడుతున్నారని అన్నారు.ఎందరో మంది బలి త్యాగాల వల్ల తెలంగాణ సాధించుకున్నామని, ఆనాడు సుష్మా స్వరాజ్ బిజెపి ఒత్తిడితో తెలంగాణ వచ్చిందని అంతేకానీ కెసిఆర్ దొంగ దీక్ష తో తెలంగాణ రాలేదని అన్నారు. ప్రతి ఒక్క పార్టీ పథకాలు,హామీలు ఇస్తాం అని చెప్పడం తప్ప తెలంగాణపై ఉన్నటువంటి అప్పునేలా తీరుస్తారని చెప్పడం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఒక్క లక్ష ఇరవై వేల అప్పువుందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పల నుండి తీర్చే పార్టీ బిజెపి అన్నారు.రాష్ట్రం లో కాంగ్రెస్ తో గెలిచిన అభ్యర్థులు బి.ఆర్.ఎస్ లో చేరడం ఖాయమని అన్నారు.రామారావు పటేల్ గెలిచాక ముదోల్ తాలూకా అభివృద్ధి కోసం తాలుకాని దత్తత తీసుకుంటానని, కేంద్ర నిధులతో సైతం అభివృద్ధి చేస్తానని తెలిపారు. దేశంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక అస్సలు మతవిద్వేషాలు చలారేగలేవని,రాష్ట్రం,తాలూకా లో కూడా బిజెపి అధికారంలోకి వచ్చాక మత విద్వేషా లాంటిది ఉండవని అన్నారు. గతంలో భైంసా అల్లర్లలో హిందూ సమాజం బాగా నష్టపోయిందని,హిందూ సమాజానికి అండగా ఉన్నటువంటి ధర్మరక్షకులకు జోహార్లంటు తెలిపారు.రానున్న రోజుల్లో బైంసా లో ప్రతి ఇంటి నుండి ఒక శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయిలా తయారయ్యి ముందుకు రావాలని అన్నారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఘనత,ఎస్సీ వర్గీకరణ కమిటీ బిజెపి తోనే సాధ్యమన్నారు. భైంసా పరిస్థితిలను దృష్టిలో పెట్టుకుని తాలూకాలో కాషాయ జెండా ఎగరలని,దానికై బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ ని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరారు. తాను గెలవగానే బాసర అభివృద్ధి, ట్రిబుల్ ఐటీ సమస్య,విద్యాలయాల నిర్మాణాలు,సదుపాయాలు కల్పించడం,సిరల కట్ట సమస్య,గడ్డెన్న పిల్ల కాలువల ద్వారా 14000 ఎకరాలకు నిరందించడం, ఆస్పత్రి సౌకర్యాలు మెరుగుపరచడం లాంటి కార్యక్రమాలను వెంటనే చే పడుతనని రామారావు పటేల్ పేర్కొన్నారు.