మునుగోడులో ఎమ్మెల్యే సైదిరెడ్డికి అపూర్వ స్పందన

హుజూర్ నగర్ అక్టోబర్ 11 (జనం సాక్షి): మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి అపూర్వ స్పందన లభించిందన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని పతంగి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ గడపగడపకు ప్రచార నిర్వహించారన్నారు. పతంగి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను, అభివృద్ధిని సంక్షేమాన్ని వివరిస్తూ టిఆర్ఎస్ పార్టీ విజయానికి భాగస్వాములు కావాలని కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళుతుందన్నారు. ప్రజలందరూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.