మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో బిజెపిని అడ్డుకోవడమే సిపిఐ లక్ష్యం
-సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ హుజూర్ నగర్ ఆగస్టు 27 (జనం సాక్షి): మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో బిజెపిని అడ్డుకోవడమే సిపిఐ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర ద్వితీయ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వామపక్షాల ఓట్లే క్రియాశీలకమని అన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలలో అలజడులు సృష్టించేందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. ఈ కుట్రల వలన బీజేపి ప్రభుత్వానికి తాత్కాలిక ప్రయోజనాలు ఏర్పడినప్పటికీ దీర్ఘకాలికంగా దేశానికి నష్టం జరుగుతుందన్నారు. ఈ విష సంస్కృతిని అడ్డుకునేందుకు సిపిఐ సమాయత్తం అవుతుందన్నారు. మునుగోడులో ఎప్పుడు గెలిచినా వామపక్షాల అభ్యర్థులే గెలిచారని, కాంగ్రెస్ అభ్యర్థి కూడా వామపక్ష మద్దతు తోనే గెలిచాడని,ఇప్పుడు కూడా వామపక్షాలు మద్దతు ఇచ్చిన అభ్యర్థే గెలుస్తాడు అన్నారు. సెప్టెంబర్ నాలుగున హైదరాబాదులోని శంషాబాద్ లో భారీ ప్రదర్శనతో రాష్ట్ర మహాసభలు మొదలవుతాయని 5,6,7, తారీకులలో మహా సభలు నడుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు యల్లావుల రాములు, దేవరం మల్లీశ్వరి, సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, నాయకులు దొంతగాని సత్యనారాయణ, గుండా రమేష్, ఇందిరాల వెంకటేశ్వర్లు, జక్కుల రమేష్, జక్కుల శ్రీనివాస్ దేశబోయిన వెంకన్న పాల్గొన్నారు.