మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్గొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్, చింతపల్లి జెడ్పిటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 21 జనం సాక్షి : టిఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి సాధ్యం..
మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలి గడపగడపకు ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాల ఫలాలు నాంపల్లి మండలం స్వాముల వారి లింగోటం గ్రామంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి మండలం స్వాముల వారి లింగోటం గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో గడప గడపకు తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఆమె కోరారు.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. పిడికెడు మందితో ప్రారంభమై చరిత్ర తిరగరాస్తున్న టీఆర్ఎస్ పార్టీది అని ఆమె తెలిపారు. గడపగడపకు ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని ఆమె తెలిపారు మునుగోడు నియోజకవర్గంలో ఏ గడపకెళ్లినా.. సీఎం కేసీఆర్‌ సంక్షేమ,అభివృద్ధి కనిపిస్తున్నదని ఆమె అన్నారు.ఎవరిని పలుకరించినా పెద్ద కొడుకులా,ఒక మేనమామ లాగా ఆదుకున్నాడనే సమాధానం వినిపిస్తున్నదని ఆమె తెలిపారు.ఫ్లోరైడ్‌తో అల్లాడిన ప్రజలకు మిషన్‌ భగీరథతో ఉపశమనం కల్పించారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు,రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్లు ఇలా ఎన్నో పథకాలతో ఇంటింటా సంక్షేమం,ఊరూరా సౌభాగ్యం పరిఢవిల్లుతున్నదని అన్నారు.మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం మునుగోడుకు ఉప ఎన్నికలు తీసుకువచ్చారని ఆమె అన్నారు.కాంట్రాక్టులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని ఆమె అన్నారు.రైతులను కాపాడుకునే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆమె అన్నారు.మునుగోడు లో కచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది అని ఆమె తెలిపారు.తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆసరా పింఛన్లు రైతు భీమా రైతు బంధు సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు అని ఆమె తెలిపారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యమైన వారిని రాజగోపాల్ రెడ్డి డబ్బుల సంచులకు లొంగరని ఆమె అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నిటిని ప్రైవేట్ పరం చేస్తుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక యం.పి.పి ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, తెరాస నాయకులు ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి,యం.పి.టి.సి రమేష్, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, దేవరకొండ జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్,యం.పి.పిలు పద్మ హనుమ నాయక్, మాధవరం సునిత జనార్దన్ రావు,గొడుకొండ్ల సర్పంచ్ కొండూరు శ్రీదేవి శ్రీనివాస్,లింగోటం గ్రామ టిఆర్ఎస్ శాఖ అధ్యక్షులు పచ్చిపాల రామకృష్ణ,తెరాస నాయకులు సిమర్ల శ్రీను యాదవ్,గంటెల ఆంజనేయులు,ఆరెకంటి మురళి,జిట్ట జగదీష్,మల్లోజు గోపి,ముత్తి రాములు, శ్రీశైలం,ఏడుకోండలు,గ్రామ మహిళల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.