మునుగోడు టికెట్టు ఆశించడం తప్పా

పార్టీ కార్యక్రమాలకు సమాచారం లేదు
మంత్రి జగదీష్ రెడ్డి పై మాజీ ఎం పి బూర నర్సయ్య గౌడ్ ధ్వజం
-సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధం
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
తాను మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని అడగడం తప్పా అని భువనగిరి మాజీ ఎం పి బూర నర్సయ్య గౌడ్ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పై ధ్వజమెత్తారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు రావడంతో తాను బరిలో నిలుస్తానని మంత్రి జగదీష్ మంత్రి జగదీష్ రెడ్డితో చెప్పానని ఆనాటి నుండి నేటి వరకు తెరాస పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు ఇలాంటి ఆహ్వానం లేకపోవడం బాధాకరమన్నారు. తనకు ఎంపీగా చేసిన అనుభవంతో మంత్రి ని కోరానన్నారు. కేవలం బీసీకి చెందిన వ్యక్తిగా తనను చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గం లో అందర్నీ కలుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను మంత్రి పట్టించుకోవడంలేదని ఒంటెద్దు పోకడ తో అంత తానే అనే భావం తో మంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తను పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తున్నానని అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో ఓటర్ల శాతాన్ని బేరీజు వేసినా అక్కడ బీసీ సామాజిక వర్గానికి పట్టు ఉందని విషయాన్ని ఆలోచించాలని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్థానికంగా తెరాస బలంగా ఉందని .మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు .మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవ్వరైనా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రతి ఒక్కరూ సహకరించి పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు తానెప్పుడు ప్రజల్లోనే ఉన్నానన్ని ,ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.మునుగోడు పేరులోనే గోడు ఉన్నది గోడు తీరాలంటే ఈఉపఎన్నికతో మునుగోడు అభివృద్ధి జరుగుతుందని ఇక్కడే ప్రజలు దూర దృష్టితో ఆలోచించి అభివృద్ధి ధ్యేయంగా ప్రజలు కేసీఆర్ కి సహకరించాలి రాజధానికి ఆమడ దూరంలో ఉన్న మునుగోడు అభివృద్ధి చెయ్యటానికి వీలు ఉంటుంది రాష్ట్ర లోనే మొదటి ఇండస్ట్రీలో పార్క్ నియోజకవర్గంలో దండు మల్కాపురంలో మొదటిగా ప్రారంభించరని గుర్తు చేశారు
ఇతర మండలాల్లో పోల్చుకుంటే మునుగోడు అభివృద్ధి లో వెనుక ఉంది ఉప ఎన్నికలతో మునుగోడు శశి శ్యామలంగా మారుతుందన్నారు నేను ఎప్పుడూ ప్రజలుకు అందుబాటులో ఉంటున్న కూడా స్తానిక నేతలుగా ఉన్న నన్ను, కర్నె ప్రభాకర్ కు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా జగదీశ్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు . మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేసిన నాటినుండి నియోజకవర్గంలో జరిగే టీఆర్ఎస్ కార్యక్రమాలకు తనకు సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. ఎవరు సమాచారం ఇచ్చినా ఇవ్వకపోయినా కేసీఆర్ నాయకత్వంలో అభ్యర్థులకతీతంగా టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బీసీలు టికెట్ ఆశిస్తూ తప్పేంటన్నారు. ఎవరు సమాచారం ఇచ్చిన ఇవ్వకపోయినా కెసిఆర్ నాయకత్వంలో అభ్యర్థులకతీతంగ టిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో బొడ్డు నాగరాజ్ గౌడ్,పాలకూరి నరసింహ, అనంత లింగస్వామి,అయితగొని లాల్ బహుదూర్,జంగిలి నాగరాజ్ తదితరులు ఉన్నారు.



