మునుగోడు ప్రజలు చాలా చైతన్య వంతులు…

పి సీ సీ చీఫ్ రేవంత్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులని టీ పి సీ సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
మునుగోడు పై దండెత్తఢానికి మొడతల దండు,తోడేళ్ళ గుంపు రెడీగా ఉందని నియోజకవర్గ ప్రజలు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉండాలన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం లో ఎందరో మహనీయులు ప్రాణాలను పణం గా పెట్టి పోరాడారు.అందులో నల్గొండ జిల్లా అమరవీరుల పాత్ర చరిత్రలో నిలిచిందని,
పెద్దల త్యాగాలను స్మరించు కుంటూ సెప్టెంబర్ 17 నుంచి ఏడాది పాటు వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించు కోవాలని పిలుపునిచ్చారు
వజ్రోత్సవ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ కి సవాల్ చేస్తున్నాని,
వజ్రోత్సవ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించనందుకు కేసీఅర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
స్వాతంత్య్రం తెచ్చింది,తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
దేశం కోసం త్యాగం చేసిన మహనీయులంతా కాంగ్రెస్ పార్టీ నేతలేనన్న విషయం మరువద్దన్నారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర గొప్పది.మనకు ఎవరు పోటీ లేరు చెప్పుకోవడానికి చరిత్ర లేనోల్లు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొడుతున్నారని విమర్శలు చేసారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ తెరాస పాలన పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రాజెక్టులన్ని పెండింగ్ లో ఉన్నాయని. ప్రస్తుతం ఆ ప్రభుత్వానికి ఎక్కడ పుట్టే పరిస్థితిలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షేభంలో కొట్టుమిట్టాడుతుందని, ప్రస్తుత పాలనకు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు తేడా ఏంటి అనేది ఆలోచించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చార్జిషీట్ అంశాలన్నింటి పై ప్రజలు బిజెపి. టిఆర్ఎస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని, ఆయన బిజెపిలో చేరడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. మునుగోడు గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడం కాయమన్నారు. బిజెపి, తెరాస పాలనపై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చార్జిషీట్ ను కాంగ్రెస్ సైన్యం మునుగోడు నియోజకవర్గంలో గడపగడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డి. సీ. సీ. అధ్యక్షులు కే. శంకర్ నాయక్.పాల్వాయి స్రవంతి రెడ్డి.రాంరెడ్డి దామోదర్ రెడ్డి. చెరుకు సుధాకర్ గౌడ్. చలమళ్ళ కృష్ణా రెడ్డి. పున్నం కైలాష్ నేత. పల్లె రవి కుమార్. విజయ రమణారావు. జ్వాలా వెంకటేశ్వర్లు. మధుకర్. కందుల భాస్కర్. అన్వార్. బూడిద లింగయ్య యాదవ్. పొలాగోని సత్యం.భీమన పల్లి సైదులు. లింగ స్వామీ తదితరులు పాల్గొన్నారు.