మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్దం

మేడ్చెల్‌,నవంబర్‌4 (జనంసాక్షి) :  త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఇసి ఆదేశాలతో సవిూక్షించి ఏర్పట్లకు సిద్దంగా ఉన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలపై సవిూక్షించారు. ఈ గతంలో ప్రకటించినట్లుగానే జులై 16వ తేదీ వరకు ఉన్న ఓటర్ల తుది జాబితా ప్రకారమే ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారులు పనిచేయాలని, పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలో దమ్మాయిగూడ, పోచారం, నాగారం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేదన్నారు. విూర్‌పేట్‌ కార్పొరేషన్‌లో వార్డుల విభజన జరుగకపోవడంతో ఎన్నికలు నిర్వహించడంలేదని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. ఇక్కడ వార్డుల విభజన జరుగని కారణంగానే ఎన్నికలు నిర్వహించడంలేదని తెలిపారు. 800మందికి ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీలలో రూ.1లక్ష, కార్పొరేషన్‌లో రూ.1.50 లక్షలు అభ్యర్థులు ఖర్చు చేయాలని సూచించారు.