మున్సిపల్ కమీషనర్‌ను నిలదీసిన ప్రజలు
బెల్లంపల్లి, జనంసాక్షి: పట్లణంలో శుక్రవారం ఇందిరమ్మ కలలు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని గోల్‌బంగ్లా బస్తీ , ఇంక్లైన్2, సభాష్‌నగర్, శాంతిగని, అంబేద్కర్ నగర్ తదితర బస్తీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ముందు ఏకరువు పెట్టారు. మున్సిపల్ కమిషనర్ మంగతాయారును నిలదీశారు. విద్య, వైద్యం తాగునీరు, రోడ్డువసతి, పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఉప ప్రణాళికలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.