మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
హైదరాబాద్, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో అటెండర్ చంద్రయ్య నుంచి రూ. 1.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అటెండర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది.