మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనలని కమిషనర్,చైర్మన్ లకు వినతి పత్రం

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనలని కమిషనర్,చైర్మన్ లకు వినతి పత్రం

ఎల్లారెడ్డి 9 అక్టోబర్ జనంసాక్షి (రూరల్)
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు అయ్యాక పర్మినెంట్ చేస్తానని మాట ఇచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ మాట తప్పారని ఆరోపిస్తూ సోమవారం నాడు ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్,చైర్మన్ సత్యనారాయణకు మున్సిపల్ కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి 9 సంవత్సరాలు గడిచిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యమ కాలంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ యూనియన్ నాయకులు,కార్మికులు, మున్సిపల్ కౌన్సిలర్లు అల్లం శీను, ఎరుకల సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.