ముప్పై ఊళ్ళ ప్రజలు తల్లడిల్లిన రోజు…

మొగిలిచర్ల     మర్ల పడ్డ రోజు…
డాక్టర్ అమెడ నారాయణ అమరత్వం…
 ఫోటో రైటప్: మృతి చెందిన ఆమెడ నారాయణ చిత్రం.. (ఫైల్ ఫోటో)
 వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 25 (జనం సాక్షి )
ఒక ప్రజావైద్యుడి ప్రస్థానం ముగిసిన రోజు 25 సెప్టెంబర్ 1996. రోజూ ప్రజల మధ్య ఉండి 24 గంటలు ప్రజలే ప్రభువులని తలచి, గీసుగొండ మండలం, మొగిలిచెర్ల గ్రామంలో పౌరహక్కుల నేత, పిల్లల డాక్టర్ రామనాధం చే ‘ప్రజా వైద్యశాలను’* ప్రారంభింపజేసి మొగిలిచెర్ల చుట్టూ ఉన్న ముప్పై గ్రామాల ప్రజలకు ఐదు రూపాయలకే వైద్య సేవలు అందించిన గొప్ప మానవతావాది ఆమెడ నారాయణ ది ” ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
వైద్యో నారాయణ హరి” అన్నట్లు, పేదల సంక్షేమం కోసం ప్రజల డాక్టర్ గా పేరుందిన నారాయణ మృతి చెంది నేటికీ పాతిక సంవత్సరాలు దాటింది.
అమెడ నారాయణ యాది లో మొగిలిచర్ల చుట్టుపక్కల గ్రామాలు పేదల డాక్టర్ లేడని ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటున్నారు.
  25 సెప్టెంబర్ మొగిలిచర్ల ఊరంతా కదిలిన రోజు. గుర్తుతెలియని దుండగుల చేతిలో కాల్పులకు గురై, అమరుడైన  నారాయణ స్మృతులు గ్రామాన్ని వీడడం లేదు. ఏనుమాముల మార్కెట్ దగ్గర కాపు కాచి, మొగిలిచెర్లకు స్కూటర్ పై వెలుతున్న ప్రజావైద్యున్ని ఉదయం 7.30 గంటలకు కాల్చివేశారు. ఆ గుర్తుతెలియని దుండగులెవరన్నది గత 26 సంవత్సరాల నుండి కనుగొనక పోవడం ప్రభుత్వాల, పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందనేది ప్రజల, కుటుంబ సభ్యుల వాదన. ఏదీ ఏమైనా ఇటు కుటుంబం, అటు ప్రజలు ఒక ప్రజావైద్యున్ని కోల్పోయిన చరిత్ర మర్లపడ్డ మొగిలిచర్లకే దక్కింది.  మొగిలిచెర్లలో ఎవ్వరిని కదిలించినా డాక్టర్ నారాయణ వైద్యసేవలు , నవ్వుతూ రోగుల సగం జబ్బును పోగొట్టే చనువు , డెబ్భై ఏండ్ల ముసలోళ్లు వచ్చినపుడు వాళ్ళను ఏ కొడుకు తిండి పెడుతున్నాడని, ఎవరు ఖర్చులు చూసుకుంటున్నారనే? కుశల ప్రశ్నలు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ వైద్యం చేసేవాడు. మొగిలిచెర్ల ప్రజా నాడిని ఎరిగిన గొప్ప వైద్యుడు నారాయణ ఆయన అందించిన సేవలు ఆదరాభిమానాలు ప్రజల మధ్య శాశ్వతంగా ఉండి ఆయన స్మరణ గుర్తు చేసుకుంటున్నారు.
Attachments area