ముమ్మరంగా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు
హుస్నాబాద్ మండలం లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 8.50 టీఎంసీల సాగునీటి ని ఈ ప్రాజెక్టులో నిల్వకు రూపకల్పన చేశారు. 85 వేల ఎకరాల కు సాగునీటి నీ అందిస్తారు. గౌరవెల్లి ప్రాజెక్టు తో పాటు గండిపల్లి ప్రాజెక్టు కు మరో 1.50 టీఎంసీలు నీటిని నింపుతారు. దీని వల్ల మరో 20 వేల ఎకరాల్లో నీటిని ఇస్తారు. కేసీఆర్ మెట్ట ప్రాంతాల్లో రైతుల కలను నిజం చేయబోతు న్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతిష్ కుమార్ చొరవ మేరకు ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 150 భారీ వాహనాలు, 500 మంది సిబ్బంది పనిలో ఉన్నారు. సోఱంగం పనులు వేగిరంగా జరుగుతుండగా, ప్రస్తుతం కట్ట పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో కూడా 26 వేల ఎకరాల్లో మిడ్ మానేరు నుండి నేరుగా కాలువల ద్వారా నీరు సగుభూము లకు అందిస్తారు. కాగా గత 30 ఏళ్ల కలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్ల లో నిజం చేస్తోంది. ఈ విషయం లో ఎమ్మెల్యే సతిష్ కుమార్ భూ నిర్వాసితుల ను ఒప్పించేందుకు ఎంతో కృషి చేశారు. మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్టు లకు మోటార్లు బిగించాలని హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపద్యంలో డిసెంబర్ నెలలో 4 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టు లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.