ముమ్మరంగా వాహనాల తనిఖీలు -ట్రాఫిక్ ఎస్సై మహమ్మద్ గాలిబ్

రోడ్డు భద్రత చర్యలలో భాగంగా మహబూబాబాద్ ఎస్పీ యోగేష్ గౌతమ్, డిఎస్పీ సదయ్య ఆదేశాల మేరకు మహబూబాబాద్ శివారులలో ట్రాఫిక్ ఎస్సై మహమ్మద్ గాలిబ్ ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ప్రయాణికులకు రోడ్డు భద్రతలపై పలు జాగ్రత్తలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాధాలను అరికట్టేందుకే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారే తప్ప వాహన దారులను ఇబ్బందులు పెట్టాలని కాదన్నారు. ప్రతి ఒక్క వహణధారుడు హెల్మెట్ ధరించాలని, మద్యాన్ని సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, త్రిబుల్ రైడ్, ర్యాష్ డ్రైవింగ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు. మనం సక్రమంగా వెళ్లినా ఎదురుగా వచ్చే వాహనాలను గమనించాలని ప్రమాధాలే జరగని జిల్లాగా మహబూబాబాద్ ను చేయాలంటే ప్రయాణికులు సహకరించాలని కోరారు. వాహనాలకు చాలాన్లు వేస్తాయని నెంబర్ ప్లేట్లు తీసి నడపడం వల్ల వాహనాలు చోరీకి గురైతే వాటిని గుర్తించి వాహణధారునికి అప్పగించడం ఇబ్బందిగా ఉంటుందని సరైన నెంబర్ ప్లేట్లు మెంటేన్ చేయాలని సూచించారు.