మురికివాడలో నివసించే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశమే బస్తీ దవాఖాన
ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్.
మిర్యాలగూడ,జనం సాక్షి.
మురికి వాడలలో నివసించే పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించడమే బస్తీ దావఖన ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం అని స్థానిక శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.గురువారం షాబు నగర్ పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి అనిమల్ల కొండల్ రావు తో కలసి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభ లో అయన మాట్లాడుతూ అందించడమే మిర్యాలగూడ పట్టణం షాబునగర్ పాత వ్యవసాయ మార్కెట్ భవన ఆవరణం నందు నూతనంగా మంజూరైన బస్తీ దవాఖానాను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి అనిమళ్ళ కొండల్ రావు తో కలసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ మురికివాడల్లో నివసించే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే బస్తీ దవాఖానాల ప్రధాన లక్ష్యంగా 2018 ఏప్రిల్ 6న తొలి బస్తీ దవాఖానాను ప్రభుత్వం ప్రారంభించింది అని బస్తీ దవాఖానాలో ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని. బస్తీ దవాఖానాలో మీకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. బస్తీ దవాఖనాలతో స్థానికులకు సకాలంలో ప్రాధమిక వైద్యం అందుతుంది అని తెలిపారు, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహ రెడ్డి, జిల్లా జడ్పీ కో ఆప్షన్ సబ్యులు మోసీన్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్ తిరునగరు నాగలక్ష్మి-భార్గవ్, ఉబ్బపల్లీ వెంకమ్మ, ఇలియాస్, ఉదయ్ భాస్కర్, డిప్యూటీ వైద్య, ఆరోగ్య అధికారి కేసా రవి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చిట్టిబాబు నాయక్, సీనియర్ నాయకులూ అన్నభిమోజు నాగార్జున చారి, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, తెరాస నాయకులూ పత్తిపాటి నవాబ్, కర్నే గోవింద్ రెడ్డి, బాసాని గిరి, ఉబ్బపల్లీ మధు, బల్లెం అయోధ్య, టీ ఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి ఎం డి .షోయబ్, లావుడి శ్రీహరి, కోలా నాగరాజు, వైద్య సిబ్బంది, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.