ముల్కనూర్ సొసైటీ బాధ్యతలు నుండి తప్పుకొని రాజకీయం చేయాలి.. సభ్యుడు లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి..
భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (28) జనంసాక్షి న్యూస్
ముల్కనూర్ సొసైటీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి సొసైటీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాకే రాజకీయ పార్టీలలో తిరగాలని సభ్యుడు లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. సంఘ అధ్యక్షుడిగా ఉంటూ సంఘంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండకూడదని నిబంధనలు మరిచి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సంఘం ద్వారా వాళ్ళ అవసరాలు తీరుస్తూ నియంతృత్వంతో నడుచుకుంటున్నాడని ఆరోపించారు. 66 మహాసభల్లో సభ్యుడిగా మాట్లాడే హక్కు ఇవ్వకుండా ప్రవీణ్ రెడ్డి కనుసైగల ద్వారా తన అనుచర గణాన్ని నాపైకి వ్యక్తిగత దూషణలతో దాడికి పాల్పడే ప్రయత్నం చేయడం ప్రవీణ్ రెడ్డి అధికార దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని ఒకరితో మొదలైన ఈ ఉద్యమం వందలాది వేలాది చేరే రోజు త్వరలోనే రాబోతున్నట్లు తిరుపతిరెడ్డి తెలిపారు. అధ్యక్షులుగా ఉన్న ఎవరైనా రాజకీయం చేయాలనుకుంటే సొసైటీ బాధ్యతలు నుండి అస్త్ర సన్యాసం తీసుకున్నకే రాజకీయ బరిలోకి దిగాలని సవాల్ చేశారు. ఏళ్ల తరబడి ఒక వ్యక్తి మాత్రమే అధ్యక్షుడిగా ఉండేలా బైలా సవరణ చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా ఓటు హక్కును తన సొంత అవసరాలకు మార్చుకున్న పద్ధతిని విడనాడి డైరెక్టర్లు ఎన్నుకునే సందర్భంలో ప్రతి సభ్యుడికి ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మీసా మహేష్, మాసాని శంకరయ్య, ఏనుగు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area