ముషారఫ్‌ అరెస్ట్‌కు కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమయ్యింది. బెయిల్‌ పొడిగించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను సింధ్‌ కోర్టు గురువారం నిరాకరించింది. దీంతో ముషారఫ్‌ ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతుండగానే ముషారఫ్‌ కోర్టు హాల్‌ నుంచి తప్పించుకున్నారు. బెయిల్‌ పొడింగింపు లభిస్తుందనుకున్న ముషారఫ్‌ ఆశలు, అడియాసలే అయ్యాయి.
బెయిల్‌ నిరాకరణతో ఒక్కసారిగా పాకిస్తాన్‌ లో వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. పాక్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోటి చేసేందుకు నాలుగేళ్ల ప్రవాసం నుంచి ఈ మధ్య ముషారఫ్‌ కరాచీకి వచ్చారు. బెయిల్‌ రద్దు కావడంతో ఏ క్షణమైనా ముషారఫ్‌ అరెస్టయ్యే అవకాశముంది.