ముస్లింల సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ కృషి: ఎంపి

ఆదిలాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణలో ముస్లింల సంక్షేమంకోసం సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. వారికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, పేద ముస్లింలకు విద్యకు గురుకులాలు నిర్మిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు వారికి కావాల్సిన కనీస సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ముస్లింలు విద్యలో రాణించడం కోసం ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలను ప్రారంభించారన్నారు. ముస్లిం ఆడపిల్లలకు ప్రభుత్వం షాదీముభారక్‌ కింద రూ.లక్షా,116 ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిముల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. మైనారిటీ వర్గాల్లో విద్యాభ్యాసం లేక అభివృద్ధి చెందడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిని గమనించి దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రత్యేకంగా మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. అందుకే ఇవాళ రాష్ట్రంలో మైనార్టీలె టిఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని అన్నారు.