ముస్లిం రాజ్యంగా ఇండియా

తోమర్‌ వ్యాఖ్యలతో కలకలం

లక్నో,నవంబర్‌1(జ‌నంసాక్షి): 2027 కల్లా భారత్‌ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ముస్లింలు యోచిస్తున్నారని హిందూ యువవాహిని ఆరోపణలతో దుమారం చెలరేగింది. ఇందుకోసం కావాలనే భారత్‌లోని ముస్లింలు సంతానాన్ని పెంచుకుంటూపోతున్నారని పేర్కొంది. దీనికి తోడు ప్రభుత్వ అజమాయిషీ కూడా లేకపోవడంతో ఎక్కువ మంది పిల్లల్ని కంటున్న ముస్లిం వారిని భరిస్తుంది భారత్‌ను అక్రమించుకునేందుకని ఆరోపించింది. ముస్లింలు పిల్లల్ని కనడం తగ్గించకపోతే 2027 కల్లా భారత్‌ ఇస్లాం రాజ్యంగా మారడం ఖాయమని హిందూ యువవాహిని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ అధ్యక్షుడు నాగేంద్ర ప్రతాప్‌ తోమర్‌ వ్యాఖ్యనించారు. ముస్లిం కమ్యూనిటీ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారని కూడా ఆరోపించారు. అఖండ భారతావనిని ముస్లింలు తమ పిడికిట పట్టాలని భావిస్తున్నారని అన్నారు. హిందూ యువవాహిని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 2002లో స్థాపించారు. తోమర్‌ వ్యాఖ్యలపై యూపిలో దుమారం చెలరేగింది. ఇదిలావుంటే హిందువులే మైనారిటీలుగా ఉన్న ఏడు రాష్టాల్ల్రో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మెజారిటీగా ఉన్న వర్గాలే ‘మైనారిటీ’ ¬దా ప్రయోజనాలు పొందుతున్నాయని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. అల్పసంఖ్యాక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. లక్షద్వీప్‌ (కేంద్ర పాలిత ప్రాంతం), మిజోరాం, నాగాలాండ్‌, మేఘాలయ, జమ్మూకశ్మీర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, పంజాబ్‌లలో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలంటూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. జాతీయ మైనారిటీ కమిషన్‌ 1992లో ఏర్పాటైంది. పలు రాష్టాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నా వారికి ఆ ¬దా ఇవ్వలేదు. వారికి లభించాల్సిన ప్రయోజనాలు ఆ రాష్టాల్లోన్రి మెజారిటీలైన ఇతర వర్గాల వారు అనుభవిస్తున్నారని అశ్విని ఉపాధ్యాయ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయా రాష్టాల్ల్రో హిందువులను

మైనారిటీలుగా పరిగణించి… వారి హక్కులను కాపాడాలని ఆయన కోరారు. ఇకపోతే మొత్తం జనాభాలో ఎంత శాతంలోపు ఉన్న వారిని మతపరమైన మైనారిటీగా పరిగణించాలనే విషయంపై స్పష్టత లేదు. రాజ్యాంగంలో దీనికి ఎలాంటి నిర్వచనమూ లేదు. దీంతో ‘మెజారిటీ’ కాని వారంతా మైనారిటీలే అనే భావన కొనసాగుతోంది. పలు సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకొని మైనారిటీల హక్కులను విద్యకు పరిమితం చేయాలని తెలిపాయి. రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని ఏ మతం మైనారిటీ కిందికి వస్తుందో నిర్ణయించాలని స్పష్టం చేసింది.