న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ ప్రైవేటు స్కూల్ లో ముస్లిం విద్యార్ధిని చెంప దెబ్బలు కొట్టేరీతిలో తోటి విద్యార్థుల్ని ప్రోత్సహించిన టీచర్‌కు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో గురించి పోలీసులు విచారణ చేపట్టారు. చర్యలు తీసుకునే రీతిలో విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిపారు. ఆ విద్యార్థిపై టీచర్ కొన్ని మతపరమైన వ్యాఖ్యలు కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముస్లిం పిల్లల తల్లితండ్రులను ఉద్దేశిస్తూ ఆ టీచర్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ తల్లితండ్రులు పిల్లలపై ఫోక్‌స చేయకుంటే ఆ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని టీచర్ పేర్కొన్నట్లు వీడియోలో ఉంది. గణితం టేబుల్‌ను నేర్చుకోని ముస్లిం పిల్లవాడిపై టీచర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అయితే పిల్లవాడికి చెందిన తండ్రి, స్కూల్ యాజమాన్యం మధ్య ఒప్పందం కుదిరింది. స్కూల్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు చేయబోనని తండ్రి అంగీకరించాడు. పిల్లవాడిని కొడుతున్న వీయోడిను రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. పవిత్రమైన స్కూల్‌ను మతవిద్వేషాలకు వాడుకుంటున్నట్లు ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు.