మూగజీవాల సంరక్షణ కై నట్టల నివారణ మందులు విధిగా వేయాలి -ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య -గ్రామంలో పారిశుధ్యం పాటించాలి -అంగన్వాడి సెంటర్ లో ఎన్రోల్మెంట్ పెంచాలి -జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ బ్యూరో-జూన్10(జనంసాక్షి)


గ్రామాల్లోని మూగ జీవాలను సంరక్షించుటకు నట్టాల నివారణ మందులు విధిగా వేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ మండలం వి.ఎస్. లక్ష్మీపుర గ్రామంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక పర్యటించి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయు కార్యక్రమంలో పాల్గొని, గ్రామంలోని వాడలు తిరుగుతూ పారిశుధ్యం పనులు, అంగన్వాడి కేంద్రాల పరిశీలన, మన ఊరు మన బడిలో ఎంపికైన పాఠశాలలను పరిశీలించారు. ముందుగా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు వేయు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని గొర్రెలకు నట్టల మందును వేశారు.  ఈ సంధర్భంగా మాట్లాడుతూ, మూగ జీవాల సంరక్షణకు నట్టల నివారణ మందును విధిగా వేయాలని సూచించారు. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులలో మిగులు నిధుల నుండి పనులు మొదలు అయి అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయాలని, గోపాల మిత్ర భవనం, వెటర్నరీ క్లినిక్ పనులు చేసి నిర్మాణం పూర్తి చేయాలని సర్పంచ్ కు తెలిపారు. గ్రామంలో పర్యటిస్తూ పరిసరాలనుపరిశీలించారు. గ్రామంలో 400 ఇళ్లకు గాను 1480 మంది జనాభా ఉండగా గత నాలుగు విడతల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో చేసుకున్న కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్యం పాటిస్తూ అందరూ ఆరోగ్యవంతంగా ఉండే విధంగా చూడాలని, విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు ఏమైనా ఉంటే మార్చాలని తెలిపారు. గ్రామంలో అందుతున్న వైద్య సేవలు, విద్యుత్, నీటిసరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడి సెంటర్ లను పరిశీలించారు. ఒక్కొక్క అంగన్వాడి సెంటర్ లో 30 మంది పిల్లలు ఉండాలని, ఎన్రోల్మెంట్ పెంచాలని, గర్భిణీ, బాలింతలకు పౌష్టికహారం అందుతున్నద అడిగి తెలుసుకున్నారు.  బాలింతలు, గర్భిణీలు కూర్చునేందుకు అంగన్వాడి సెంటర్ లో కుర్చీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పిల్లల బరువును చూస్తూ వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిల్లలతో మాట్లాడారు.  తల్లిదండ్రులతో నెలకోసారి సర్పంచ్, అధికారులు మాట్లాడాలని, పిల్లల చదువు, ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలని, డ్రాప్ ఔట్ లేకుండా చూడాలని, అంగన్వాడి సెంటర్ లో ఎస్.బి.ఎం. ద్వారా టాయ్లెట్ నిర్మించాలని, అలాగే విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన ఎంపీపీఎస్., జెడ్పి సెకండరీ స్కూల్ లను పరిశీలించారు.  పాఠశాలలో చేయవలసిన పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు.  ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుతుందని గ్రామస్తులకు అవగాహన కల్పించి ప్రైవేట్ వైపుకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. పాఠశాలలో పిల్లల శాతం తక్కువగా ఉన్నదని, పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్న సమయంలో పిల్లల శాతం అందుకు తగిన విధంగా పెంచాలని, ఎన్రోల్మెంట్ పెంచిన పక్షంలో అదనపు గదులు ఏర్పాటు చేసుకోవచ్చని, మిగతా గుర్తించిన  అన్ని పనులను పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరకాల వెంకన్న, యాదవ సంఘం అధ్యక్షుడు గుండెబోయిన సత్యనారాయణ, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డాక్టర్ టి.సుధాకర్, డాక్టర్ రాజేష్, ఎంపిడిఓ కె. వెంకటేశ్వర్లు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్. వెంకటేశ్వర్లు, ఉపేందర్ లు,  అధికారులు, జిల్లా పశుగణాభివృద్ధి గోపాల మిత్రలు బత్తుల సంతోష్, శంకర్ లు, అంగన్వాడి టీచర్ లు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
3 Attachments