మూడునెలల్లోగా రెవెన్యూ దరఖాస్తులు పరిష్కారిస్తామన్న మంత్రి రఘువీరారెడ్డి
భద్రాచలం: రెవిన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో రఘానాధ్ మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం శ్రీరామనమి ఏర్పాట్లపై ఈవోతో సమీక్షించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చానున్నారు. 28వేల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, అందులో 21 వేల గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సదస్సుల్లో వివిధ సమస్యలపై సుమారు 8లక్షల దరఖాస్తులు వచ్చాయాన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దరఖాస్తులను మూడు నెలల్లోగా నూరుశాతం పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే సత్యవతి, సబ్ కలెక్టర్ నారాయణగుస్తా , రామాలయం ఈవో రఘనాధ్ తదితరులున్నారు.