మూడు మునకలకు.. మూడు గంటలా?

4

– బాబు సినిమా ప్రోమో షూటింగ్‌

– 30 నిండు ప్రాణాలు బలి

హైదరాబాద్‌,జులై15(జనంసాక్షి): పాలకులకు ఏదైనా ఆర్భాటమే. గంగాలో మునిగిన, రోడ్డుపై గెంతిన ప్రచారం కావాలి. మీడియా మేనేజ్‌మెంట్లలో బాబుదిట్ట.గోరంత దానికి కొండంతప్రచారం కావాలి. ప్రజల సమస్యలు పరిష్కరించలేని పాలకులు ఆ సమస్యలు నీటిలో మునకేస్తే పోతాయని ఓ ఆశాస్త్రీయ ప్రచారం చేస్తూ అది నిజమేనని వచ్చిన అమాయక ఉత్తరాంధ్రాజనం అధికంగా బలిఅయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు పుష్కర స్నానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా మూడు సార్లు మునిగి పుష్కర స్నానం చేసేందుకు మూడు గంటల సమయం వెచ్చించడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. నిరంతం ప్రచారం కోసం పరితపించే చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా  జనసామాన్యం కోసం ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌ లోకి ప్రవేశించి మూడు గంటల సమయం వెచ్చించి పుష్కర స్నానం ఆచరించారు. ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున కుంభమేళాకు తీసిపోని రీతిలో పుష్కరాలను నిర్వహిస్తోందని.. అనే విషయాన్ని అంతర్జాతీయంగా చాటడానికి షార్ట్‌ ఫిలిం రూపకల్పన జరిగినట్టుగా తెలుస్తోంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని సీఎం చంద్రబాబు తీరిగ్గా మూడు గంటలసేపు పుష్కర స్నానం కోసం గడిపారని తెలుస్తోంది. కానీ ఈ లోపు జరిగిన తోపులాటలో 30 మంది చనిపోయారు. బాబుకన్నా మునుపే ఘాట్‌ లను చేరుకొన్న భక్తుల తీవ్ర ఇబ్బందులుపడ్డారు. నాలుగైదుగంటల సేపు తీవ్రమైన జనసమ్మర్ధంలోని నలిగిపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవగానే, అంతా ఒక్క ఉదుటన ముందుకు రావడంతో ప్రాణనష్టం జరిగింది. ఈ విధంగా ఏపీ ప్రభుత్వ ప్రచార ఆరాటం  అమాయకుల ప్రాణాలను తీసిందని సమాచారం. పుష్కర ముహూర్తం పరిశీలిస్తే మంగళవారం తెల్లవారుజామున 5.26కే ఐముఖ్యమంత్రి ¬దాలో చంద్రబాబు రమారవిూ ఘాట్‌లోకి ప్రవేశించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం వీఐపీ ఘాట్‌ కమ్‌ సరస్వతి ఘాట్‌ లో బాబు స్నానమాచరించాలి. అయితే ఆయన జనసామాన్యం కోసం ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌ లోకి ప్రవేశించి మూడు గంటల సమయం వెచ్చించి పుష్కర స్నానం ఆచరించడంతో భక్తులకు ఘోరం జరిగింది. కాగా షార్ట్‌ ఫిలిం సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించడం లేదు.