మూడేళ్లయినా మారని ఆర్థిక పరిస్థితులు

సామాన్యులకు మరిన్ని రద్దు కష్టాలు

ఖరీదుగా మారిన బ్యాంకింగ్‌ లావాదేవీలు

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): నగదు చెలామణి బాగా ఎక్కువగా ఉన్న భారతదేశంలో పెద్దనోట్ల రద్దు వల్ల

ఏర్పడిన సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు మూడేళ్లయినా దాని ప్రభావంనుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోక పోగా, దాని ప్రభావం ఇంకా వీడం లేదు. ఆన్‌లైన్‌ సేవలతో ఇప్పుడు అనేక సంస్థలు లాభాలు ఆర్జిస్తున్నాయి. పేటిఎం, గూగుల్‌ పే వంటి సంస్థలకు అప్పనంగా ఆదాయాన్ని కట్టబెట్టినట్లు అయ్యింది. ఇకపోతే లావాదేవీలన్నీ బ్యాంకింగ్‌ ద్వారా ఎక్కువగా జరిగేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. దీంతో వారు మన లావాదేవీలపై ఆంక్షలు పెటట్‌ఇ, వాటిని అధిగమించిన సందర్భాల్లో సర్‌ఛార్జీలు వేస్తున్నారు. కరోనాతో ప్రజలు తీవ్రంగా నష్టపోయినా బ్యాంక్‌ల తీరులో మార్పు రావడం లేదు. బ్యాంకింగ్‌ నిపుణులు చెప్పిన మాటలు మూడేళ్లుగా చూస్తుంటే బూటకమని తేలింది. సామాన్యులు బ్యాంకుల వైపు వెళితే వాతలు తప్ప మరోటి కనపించడం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు బ్యాంక్‌ సేవలు ఖరీదైనవిగా మారాయి. ప్రతి పనికి సర్వీస్‌ టాక్స్‌ పేరుతో చేస్తున్న వసూళ్ల కారణంగా సామాన్యులు బ్యాంకుల జోలికి వెళ్లని దుస్థితి కల్పించారు. ఎటిఎంలను దిష్టిబొమ్మలుగా మార్చారు. నగదు దక్కకుండా చేయడంతో పాటు, నగదు కోసం కళ్లరిగేలా తిరిగితే తప్ప దక్కని దుస్తితి తీసుకుని వచ్చారు. బ్యాంకుల లావేదేవీలు పెంచేందుకు నోట్ల రద్దు తోడ్పడుతుందని, పారదర్శకత పెరగుతుందని అన్న మాటల్లో అర్థం లేదని మూడేళ్ల పరిణామాలను పరిశీలించిన వారికి తెలుస్తుంది. లావాదేవీలు పెరిగి బ్యాంకులపైనా పనిభారం పెరిగి ఉద్యోగ నియామకాలకు కూడా అవకాశాలు వస్తాయని భావించారు. కానీ లావాదేవీలు తగ్గాయని తెలుసుకుంటే మంచిది. నగదు లావాదేవీలను తగ్గించేందుకు గట్టి చర్యలు అవసరమని ఎంతో కాలంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. బ్యాంకులు కూడా దీనినే ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. అధిక విలువ కల నోట్లు రద్దు చేయటంతో నగదు చలామణి తగ్గిపోనుందన్నారు. ఈ రెండూ జరిగినా సేవల విషయంలో బ్యాంకులు వ్యాపార ధోరణి అవలంబించడం వల్ల సామాన్యకలు ఒరిగిందేవిూ లేదు. దీనికి తోడు ఎలక్టాన్రిక్‌ చెల్లింపుల విధానం ఇటీవలకాలంలో బాగా వాడుకలోకి వచ్చింది. దీంతో ఇప్పటికే మనదేశం పూర్తి నగదు రహితం కాకపోయినా, తక్కువ నగదు చలామణి దిశగా ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారేందుకు కొంత వీలుకల్పించినా అది కూడా పెటిఎం, వీసాలాంటి సంస్థలకు మేలుచేసేదిగా మారిందే తప్ప మరోటి కాదు. నల్లధనం సమస్య తగ్గి, అధికారిక లావాదేవీలు పెరిగిన పక్షంలో అది ఆర్ధికాభివృద్ధిపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ ఆదాయాలు పెరిగి, లోటుభారం తగ్గుతుంది. నల్లధనం కట్టడికి, ఇతరత్రా ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలతో ఆర్థికాభివృద్ధి ఇంకా అధికం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడంతో వ్యాపారాలు చిన్నబోయాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమైనదని అందరూ అంచనా వేసినా అది తప్పని తేలిపోయింది. రద్దు నిర్ణయంతో మనదేశంలో రూ. 30 లక్షల కోట్లకు పైగా నల్లధనం కుప్పకూలుతుందని ఆర్థిక నిపులు వేసిన అంచనాలు తలకిందుల య్యాయి. అధిక విలువ కల నోట్లు చెలామణిలో ఉండటం, ఇతరత్రా సవాళ్ల వల్ల నల్లధనాన్ని పూర్తిగా అదుపు చేయలేని పరిస్థితి ఇప్పటి వరకూ ఉందని ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనది మాత్రమే కాకుండా నల్లధనాన్ని గణనీయంగా తగ్గించివేస్తుందని అన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రస్తుతం అనధికారికంగా ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా ఉన్న సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లో చేరగలదని బుకాయించారు. ఇకపోతే చిన్న మొత్తాల నుంచి భారీ చెల్లింపుల వరకూ అంతా నగదు ద్వారానే చేసే అవకాశం పెరుగుతందని అన్నారు. అయితే బ్యాంకులు, కార్డుల ద్వారా చెల్లింపులు పెరిగేందుకు అవకాశం మాత్రమే వచ్చిందిని స్పష్టమవుతోంది. మనదేశంలో దాదాపు 100 కోట్ల సేవింగ్స్‌బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి బ్యాంకింగ్‌ లావాదేవీలు ఇకపై అధికం అవుతాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ‘జన్‌ధన్‌ యోజన’ కింద సామాన్యులకు బ్యాంకు ఖాతాల సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివలన బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పెరగ నున్నాయని అన్నారు. అలాగే అన్ని ఖాతాలకూ ఆధార్‌ను అనుసంధానం చేయడం, నగదు బదిలీ పథకం వంటి ప్రభుత్వ చర్యలు నగదు లావాదేవీలను తగ్గించే కార్యక్రమాల్లో భాగమే అన్నారు. మొత్తంగా బ్యాంకుల సేవలను చూస్తే సామాన్యులు అటువైపు వెళ్లకుండా చేశారు.