మూడేళ్లలో అద్భుత పాలన సాగించాం

– ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాం
– తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి
– స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వకారణం
– ¬ంశాఖ మంత్రి మహమూద్‌ అలీ
– జీఎంహెచ్‌ఎంసీ పాలకమండలికి మూడేళ్లు పూర్తి
– సంబురాలు చేసుకున్న సిబ్బంది
– పాల్గొన్న మహముద్‌అలీ, నాయిని, తలసాని, కమిషనర్‌, మేయర్‌
– అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడి
హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : మూడేళ్లలో అద్భుత పాలన సాగించామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టామని ¬ంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు మరో అవార్డు వరించింది. హైదరాబాద్‌ నగరానికి ‘స్వచ్ఛత ఎక్సలెన్సీ’ అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రకటించింది. 10లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్‌ నగరాలలో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ఈ పురస్కారం లభించింది. ఈ అవార్డు రావడం పట్ల సోమవారం  జీహెచ్‌ఎంసీ పాలకమండలి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ¬ంమంత్రి మహముద్‌ అలీ, మాజీ మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ¬ంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్‌కు వలసలు పెరిగాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. హైదరాబాద్‌కు స్వచ్ఛ సర్వేక్షన్‌లో అవార్డు రావడం ఎంతో సంతోషకరమన్నారు. నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్లలో జీహెచ్‌ఎంసీ పాలక మండలి బాగా పని చేసిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్‌ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, మారుమూల బస్తీల్లో కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది నాయిని అన్నారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. గతంలో జీహెచ్‌ఎంసీకి చెడ్డ పేరుందని, ప్రస్తుతం ప్రణాళికబద్ధంగా పని చేస్తోందన్నారు. హైదరాబాద్‌ దేశానికి తలమానికంగా ఉండాలన్నారు. నగరాభివృద్ధికి ప్రతివారం అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ సమావేశాలు ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల సహకారం ఉంటుందని తెలిపారు. దాన కిశోర్‌ మాట్లాడుతూ.. దేశంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో ఎన్నో అవార్డులను జీహెచ్‌ఎంసీ అందుకుంటుందని, అధికారులు పని చేసేలా సహకరించే ప్రభుత్వం తెలంగాణలో ఉందని కొనియాడారు.