మూడోరోజూ శశికల బంధువుల ఇల్లపై ఐటి సోదాలు

చెన్నై,నవంబర్‌11(జ‌నంసాక్షి): తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బంధువులు, జయటీవీ కార్యాలయంలో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. జయటీవీ ఆఫీస్‌, నమధు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయం సహా చెన్నైలోని మొత్తం 40 చోట్ల శనివారం ఉదయం నుంచి ఏకకాలంలో అధికారులు తనీఖీలు చేపట్టారు. శశికళ మేనల్లుడు, జయటీవీ ఎండీ వివేక్‌ జయరామ్‌, అతడి సోదరి కృష్ణ ప్రియ నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు. శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ గురువారం నుంచి సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. పన్ను ఎగవేత, డొల్ల కంపెనీల్లో పెట్టుబుడులు పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. గురువారం తమిళనాడు, దిల్లీ, ఆంధప్రదేశ్‌, పుదుచ్చేరిలోని 187 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. శుక్రవారం మరోసారి సోదాలు చేపట్టిన అధికారులు శశికళ కుటుంబసభ్యులు, బంధువులకు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. పదుల సంఖ్యలో రహస్య లాకర్లను గుర్తించారు. ఈ సోదాల్లో రూ. కోట్ల విలువైన ఆస్తులు, నగదు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లభించినట్లు సమాచారం.