మూడో దశను కొనసాగిస్తున్న కొవాగ్జిన్‌

ప్రపంచంలోనే మూడో దశలో ఏకైక వాక్సిన్‌

శాస్త్రవేత్తల కృషికి మోదీ అభినందన

కరోనాపై పోరాటంలో భారత్‌ ముందంజ

వ్యాక్సిన్‌ తయారీకి మరింత కృషి చేయాలని సూచన

హైదరాబాద్‌,నవంబర్‌ 28  (జనం సాక్షి):  కోవిడ్‌1/-ఖ9 వ్యాప్తికి కళ్లెం వేసే వ్యాక్సీన్ల అభివద్ధి పక్రియలను పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని భారత్‌ బయోటిక్‌, అహ్మదాబాద్‌లోని జైడస్‌ బయోటిక్‌ పార్క్‌, పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు.

భారత్‌లోని తొలి దేశీయ వ్యాక్సీన్‌ ”కోవ్యాక్సీన్‌’ తయారు చేస్తున్న భారత్‌ బయోటెక్‌ సందర్శనకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. భారత్‌ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ, పురోగతిపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి పూర్తి వివరాలను శాస్త్రవేత్తలను మోదీ అడిగి తెలుసుకున్నారు. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతోంది. బయోటెక్‌లో మోదీ తిరుగుతూ సందర్శించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, తయారీ గురించి అక్కడి శాస్త్రవేత్తలు మోదీకి వివరించారు. కాగా, ప్రభుత్వం/-ఖప్రైవేటు భాగస్వామ్యంలో ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాదాపు గంట పాటు ప్రధాని మోదీ శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతోంది. మొదటి రెరడు దశల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా మంచి ఫలితాలు రావడంతో మూడో దశను కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌.. ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మోదీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.వ్యాక్సిన్‌ తయారీ ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని మోదీ ఆరా తీశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, తయారీ గురించి మోదీకి వివరించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మోదీ అన్నారు. శాస్త్రవేత్తల కషికి మోదీ అభినందించారు. వ్యాక్సిన్‌ తయారీకి మరింత కషి చేయాలని మోదీ సూచించారు. నగరానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో మోదీ నగరానికి చేరుకున్నారు. భారత్‌ బయోటిక్స్‌లో సిద్ధం అవుతున్న కరోనా వ్యాక్సిన్‌ఎ/-లాంట్‌ను మోదీ పరిశీలించారు. అనంతరం వ్యాక్సిన్‌పై సవిూక్ష నిర్వహించారు. గ్రేటర్‌ ఎన్నికల

వేళ మోదీ నగరానికి రావడంతో బిజెపి వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. మోదీ హైదరాబాద్‌ రావటానికి ముందు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్‌ క్యాడిలా సంస్థను సందర్శించారు. అక్కడ అభివద్ధి చేస్తున్న జైకోవ్‌డ్ఖీ వ్యాక్సీన్‌ తయారీ పురోగతి గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. జైకోవ్‌డ్ఖీ వ్యాక్సీన్‌ డిసెంబరులో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే అవకాశముంది. ఏప్రిల్‌ నాటికి ఈ వ్యాక్సీన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందని వార్తలు వచ్చాయి.

అహ్మదాబాద్‌ లోని జైడస్‌ టీకా అభివద్ధిని సవిూక్షించిన మోదీ

కరోనా వ్యాక్సిన్‌ అభివద్ధి పై సవిూక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటన చేపట్టారు. శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్న మోదీ.. అక్కడి జైడస్‌ క్యాడిలా బయోటెక్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ సంస్థ అభివద్ధి చేసిన ‘జైకోవ్‌డ్ఖి’ టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్‌ ధరించి వ్యాక్సిన్‌ ప్రయోగశాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ రెరడో దశ ప్రయోగాల్లో ఉంది. దాదాపు గంటపాటు ఎ/-లాంట్‌లో గడిపారు. అంతకుముందు సంస్థ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్‌లతో మోదీ చర్చించారు. జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ ప్లాంట్‌ను మోదీ సందర్శించారు. ఇక్కడ తయారు చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సీన్‌ గురించి శాస్త్రవేత్తలు ప్రధానమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా వ్యాక్సీన్‌ ట్రయల్స్‌లో సాధించిన పురోగతికి గాను శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తో కలిసి సంస్థ ఈ వ్యాక్సీన్‌ అభివద్ధి చేస్తోంది. దీనిని వేగవంతం చేయటానికి భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తల బందం పనిచేస్తోందని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవ్యాక్సీన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. భారతదేశం అంతటా 26,000 మంది మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నారని భారత్‌ బయోటెక్‌.. మోదీ సందర్శన అనంతరం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలో బయోసేప్టీ లెవల్‌3/-ఖ స్థాయి గల తమ ఏకైక ఉత్పత్తి కేంద్రంలో కోవ్యాక్సీన్‌ ఉత్పత్తి జరుగుతుందని చెప్పింది. హైదరాబాద్‌ నుంచి మోదీ మహారాష్ట్రలోని పుణెలో గల సీరం ఇన్‌స్టిట్యూట్‌ను కూడా సందర్శించారు. ఈ సంస్థ.. ఆక్స్‌ఫర్డ్‌ఆ/-ఖస్ట్రాజెనెకా ద్వయం అభివద్ధి చేస్తున్న వ్యాక్సీన్‌ను తయారుచేస్తోంది. ఇది ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇదిలావుంటే.. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ మొదలుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ దాకా.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌గా కాకుండా రాజకీయంగా వాడుకుంటున్నారని పొలిటికల్‌ ఎకానమి ఆఫ్‌ హెల్త్‌ నిపుణులు ఫ్రొఫెసర్‌ పురేంద్ర ప్రసాద్‌ బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ”కోవిడ్‌1/-ఖ9పై పోరాటంలో కీలక దశలోకి భారత్‌ అడుగుపెడుతోంది. భారత ప్రజలకు వ్యాక్సీన్‌ చేరవేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, వ్యూహాల గురించి నేరుగా తెలుసుకునేందుకు ఈ సంస్థలను మోదీ సందర్శిస్తున్నారు’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ చేసింది. 70 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సీన్‌ పనిచేస్తున్నట్లు ఇటీవల విస్తత స్థాయిలో చేపట్టిన అధ్యయనంలో తేలింది. వ్యాక్సీన్ల అభివద్ధి పర్యవేక్షణకు సీరం ఇన్‌స్టిట్యూట్‌తోపాటు జెనోవా బయోఫార్మాస్యూటికల్‌ సంస్థ కార్యాలయాలకు దాదాపు వంద దేశాల రాయబారులు, హైకమిషనర్లు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.