మృగాళ్లకు బహిరంగ ఉరేసరి

నిర్భయచట్టంతో లాభం లేదని రుజువయ్యింది
ఆందోళన కలిగిస్తోన్న వరుస అత్యాచార ఘటనలు
న్యూఢిల్లీ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. మగాళ్లు మృగాళ్లుగా మారుతున్న వైనం కలచివేస్తోంది. మానవసంబధాలు మంటకలుస్తున్నాయి. వావివరుసల సంగతి పక్కన పెడితే బాలికలని కూడా చూడడం లేదు. అలాగే వికలాంగులు, పిచ్చివాళ్లని కూడా చూడడం లేదు. రాక్షసప్రవృత్తి పెరుగుతోందనడానికి ఇటీవలి వరుస ఘటనలు ఉదాహరణగా చూడాలి. నిర్భయచట్టం తీసుకుని వచ్చినా అది చేవచచ్చిన చట్టంగా ఉంది. కఠిన శిక్షలు, బహిరంగ శిక్షలు అమలు చేస్తే తప్ప ఈ ఉన్మాదం తగ్గేలా లేదు. ఆడదాన్ని కన్నెత్తి చూస్తే ఉరివేస్తార్న భయం కలిగేలా చేయాలి. జైళ్లు,శిక్షలతో లభం లేదని ఇప్పటి వరకు జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌ ఉన్నావొ, జమ్మూ కాశ్మీర్‌ కథువా అత్యాచార ఘటనలు అత్యంత అమానుషం కాగా ఆ కేసులను నీరుగార్చేందుకు  ప్రయత్నాఉల జరిగాయి. ఇవే కాదు ఇలాంటి వందల కేసులు నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇలానే ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు రాకపమానదు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోక తప్పదేమో అన్న ఆందోళన కలుగుతోంది.  అత్యాచార కేసులను సత్వరంగా విచారించి కనీసంగా పక్షం రోజుల్లోనే తీర్పు చెప్పి ఉరిశిక్ష విధించేలా చూడాలి. బహిరంగ ఉరిశిక్షలు అమలు చేయాలి. ఇస్లామిక్‌ దేశాల్లో లాగా నం కూడా చట్టాలు
చేసుకోవాలి.   అనేకప్రాంతాల్లో వెలుగుచూస్తున్న ఉదంతాలనూ పరిశీలిస్తే అక్కడ ప్రజాపాలన కొనసాగుతోందా లేక ఆటవిక రాజ్యం కొలవు తీరిందా అన్న సందేహాలు కలగకమానవు. మహిళలపై అకృత్యాలు పెరగడం ఒక ఎత్తయితే వాటిలో కుల,మతాలను చొప్పించడం మరో ఎత్తు. దేశంలో నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాక స్త్రీలను వ్యాపార సరకుగా, ఆటబొమ్మగా చూసే వికృత సంస్కృతి బయలుదేరింది. ప్రభుత్వాల విధానాలు కఠినపంగా లేకపోవడం కారణంగా ఈ విపరీత పోకడలు  వెర్రితలలెత్తుతోంది. ఉన్నావొ ఘోరం ఇప్పటిది కాదు. ఏడాది క్రితమే ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా నిందితులపై ఎలాంటి చర్యల్లేవు. తనపై బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ అత్యాచారం చేశాడని పదిహేడేళ్ల మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాంతో నిందితులను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందు బాధితురాలు బైఠాయించింది. న్యాయం కోసం ధర్నా చేసిందన్న అక్కసుతో నిందితుడైన ఎమ్మెల్యేకు చెందిన గూండాలు బాధితురాలి ఇంటిపై దాడి చేసి ఆమె తండ్రిని అపహరించి దారుణంగా కొట్టారు. నిలువెల్లా నెత్తురోడుతూ బాధితురాలి తండ్రి పోలీస్‌స్టేషన్‌కెళ్లి ఎమ్మెల్యే సోదరుని నాయకత్వంలో గూండాలు తనను అంతం చేసేందుకు ప్రయత్నించారని గోడు వెళ్లబోసుకొని అక్కడే తనువు చాలించాడు. అతడు చెప్పిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. సర్వత్రా నిరసనలు మిన్నంటాక, హైకోర్టు రంగంలోకి దిగి సిబిఐ విచారణకు ఆదేశించాకనే ఎమ్మెల్యే అరెస్టు జరిగింది. జమ్మూ కాశ్మీర్‌ కథువా ఘటన మరింత దారుణమైంది. గొర్రెలను, మేకలను మేపుకుంటూ సంచార జీవనం సాగించే బభేర్వాల్‌ అనే తెగకు చెందిన ఎనిమిదేళ్ల అసిఫాను కొందరు దుండగులు బలవంతంగా అడవికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై దౌర్జన్యం చేసి మత్తుపదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపి రాళ్లతో కొట్టి చంపిన ఘాతుకం మానవ మాత్రులన్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తుంది. ఈ దారుణంలో పాల్గొన్నవారు ఇద్దరు మైనర్లు కాగా మరో ఇద్దరు పోలీస్‌ విభాగానికి చెందిన ప్రత్యేక సిబ్బంది. అయితే ఇందులో రోహింగ్యాల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపైనా విచారణ జరపాలి. ఇదే నిజమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాలకులు సిగ్గు తెచ్చుకోవాల్సిన ఉన్నావొ, కథువా ఘటనలపై ప్రధాని మోడీ తొలుత నోరు మెదపలేదు. పౌర సమాజం నుంచి నిరసనలు వెల్లువెత్తాకనే రెండు ఉదంతాలను ఖండించారు. కాంగ్రెస్‌ హయాంలో ఢిల్లీ నడి వీధుల్లో చోటు చేసుకున్న ‘నిర్భయ’ నిందితులను ఉరి తీయాలన్న బిజెపి  నాయకులకు ఉన్నావొ, కథువా ఘటనలపై స్పందించిన తీరు సరిగా లేదు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలను రూపొందించాలి. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుఉలు ఏర్పాటుచేసి పక్షం రోజుల్లో శిలు పడేలా చూడాలి. అప్పుడే అత్యాచార ఘటనలు కొంతయినా తగ్గుతాయేమో చూడాలి.