మృణాళిని సారాభాయి ఇకలేరు

5

అహ్మదాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్‌ మృణాళిని సారాభాయి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న మృణాళిని బుధవారం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆమె చనిపోయినట్టు ఆమె కొడుకు కార్తికేయ వెల్లడించారు. మృణాళిని 1918లో కేరళకు చెందిన ప్రముఖ కుటుంబంలో పుట్టారు. విశ్వకవి రవీంద్రనాధ్‌ఠాగూర్‌ పర్యవేక్షణలో శాంతినికేతన్‌లో విద్యనభ్యసించారు. అనంతరం యూఎస్‌ వెళ్లిపోయి అక్కడ అమెరికాన్‌ అకాడవిూ ఆఫ్‌ డ్రమాటిక్‌ ఆర్ట్‌లో చేరారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన అనంతరం విూనాక్షి సుందరం పిళ్లై వద్ద భరతన్యాటంలో శిక్షణ పొందారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయిని మృణాళిని 1942లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు కార్తికేయ, కూతురు మల్లికా సారాభాయి ఉన్నారు. కూతురు మల్లికా సారాభాయి ప్రముఖ భరత నాట్య కళాకారిణాగా ప్రసిద్ధి చెందారు. మృణాళిని 1948లో గుజరాత్‌లో దర్పణ అకాడవిూని స్థాపించారు. ఈ అకాడవిూ ద్వారా వేలాది మందిని భరతనాట్యంలో తీర్చిదిద్దారు. సుభాష్‌ చంద్రబోష్‌తో కలిసి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో పని చేసిన కెప్టెన్‌ లక్ష్మీ సెహ్‌గల్‌ మృణాళిని సోదరుడే కావడం గమనార్హం.విశ్వకవి రవీంద్రనాథ్‌  ఠాగూర్‌ ఆధ్వర్యంలో మృణాళిని విద్యనభ్యసిం చారు. భారత అంతరిక్షపితామహుడు విక్రం సారాబాయిని మృణాళిని 1942లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు సీఈఈ(సెంట్రల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ ఎడ్యుకేషన్‌) వ్యవస్థాపకులు కార్తికేయ సారాబాయి, కూతురు  క్లాసికల్‌ డ్యాన్సర్‌ మల్లికాసారాబాయిలు ఉన్నారు. కళలకు సంబంధించి ఏర్పాటు చేసిన దర్పణ అకాడవిూ వ్యవస్థాపక డైరెక్టర్‌గా మృణాళిని బాధ్యతలు నిర్వహించారు. ఈ అకాడవిూ నుంచి ఇప్పటి వరకు దాదాపు

18,000 మంది విద్యార్థులు భరతనాట్యం, కతాకలి నుంచి పట్టాలు పొందారు. నృత్యకారిణిగానే కాకుండా మంచి రచయిత్రి, కవయిత్రిగా కూడా మృణాళిని గుర్తింపు పొందారు. వాతావరణ సమస్యల పై పోరాడిన ఒక గొప్ప పర్యావరణ వేత్త.క్లాసికల్‌ డ్యాన్స్‌లో ప్రావీణ్యం పొంది కొరియగ్రాఫర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలివాళ్లలో ఈవిడ కూడా

ఒకరు.మృణాళిని తండ్రి డా.స్వామినాథన్‌, సోదరుడు గోవింద్‌ స్వామినాథన్‌లు మద్రాస్‌ హైకోర్టులో ప్రఖ్యాత న్యాయవాదులుగా గుర్తింపుపొందారు. తల్లి అమ్ము స్వామినాథన్‌

స్వాతంత్య్ర సమరయోధురాలు. సోదరి లక్ష్మీ సెహగల్‌ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ‘ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్‌’కు సైన్యాధిపతిగా వ్యవహరించారు.